చదువెందుకు....?

చదువెందుకురా........ అంటే....... చంకనాకనురా....... అని ఒక మాష్టారు మా చిన్నప్పుడు అనేవారు;
ఎంటబ్బా ఇలాగ అంటున్నారు!!! అని అనుకునేవాడ్ని;

వయసు పెరిగే కొద్దీ..... తెలియడం మొదలయ్యింది ..... ఏంటంటే
చదువనేది.... చంకనాకుతూ బ్రతకడానికని

చదవాలన్నా.... వినాలన్నా "చంకనాకడం" అనే పదం (పదాల సముదాయం) కొంచం ఇబ్బంది అనిపిస్తుంది కానీ ....... 

ఉద్యోగ స్వామ్యంలో ... ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులల్లో ఎక్కువగా జరిగే వాస్తవ విషయం "చంకనాకడం"

IAS చదివినా ..... IPS చదివినా...... చంకనాకాల్సిందే .... లేకుంటే .... 
Archaeology Department కే పంపిస్తారు!
అలా పంపించడాన్ని "అవమానించారు" అని అనడం ఏ మాత్రం సమంజసం కాదు.

ఏవైనా అభ్యంతరాలు ఉన్నయెడల,
లేక ఏమైనా అవినీతి అంశాలు ఎవరి దృష్టికైనా వస్తే .....
కోర్టులను ఆశ్రయించి న్యాయం కోసం పోరాడాలి అంతే కానీ....
ప్రజలు ఎన్నుకున్న గొప్ప గొప్ప వ్యక్తుల గురించి తప్పుగా మాట్లాడటం ఎవరికీ శోభనీయదు.

చంకనాకడానికి "ఆకులు" కాకపోతే ఇంకొక "పాకులు" ఉంటారు.
Posting ఇచ్చిన చోట ఉన్న వాటితో సర్దుకుని ఉద్యోగం చేయాలి, అంతేకాని .....

భవిష్యత్తులో........ మేధావులుగా........... మహనీయులుగా కీర్తించబడే ...
నేటి గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు కొంచెము ఆలోచించడం మంచిది. ఎందుకంటే ....
వారి వెనుక అన్నీ తెలిసిన ప్రజలు ఉన్నారు అలాగే....
ప్రజలకు సేవ చేయాలని పెద్ద పెద్ద చదువులు చదువుకున్న ఉద్యోగులు ఉన్నారు.

అయినా.....
చంక నాకే వారికి, అలాగే..... చంక నాకిచ్చుకునేవారికి లేని బాధ మరొకరికి ఎందుకు?

ఎలాగయితే........
చిన్న, చిన్న చదువులు చదువుకున్న వారికి పెద్ద పెద్ద చదువులు చదువు కున్న వారి చంకలు దొరుకుతాయో.....

అలాగే.....
పెద్ద, పెద్ద చదువులు చదువుకున్న వారికి ప్రజలు ఎన్నుకున్న పెద్ద పెద్ద (గొప్ప) వ్యక్తుల చంకలు దొరుకుతాయి ..... .

చంకలు దొరికినప్పుడు నాకాలి, చేతకాకపోతే ........
నాకుతున్న వారిని చూసి నేర్చుకోవాలి అంతే కాని....

నిజాయితీ, నిబద్దత అంటూ మాట్లాడటం వలన ఉపయోగం ఏముంటుందో అర్ధం కావడం లేదు.

సమాజం మొత్తం ఎటు వైపు ఉందో... ఏ విధంగా ముందుకు వెళుతున్నదో ...... చూసి ఆ విధంగా నడుచుకోవాలి. 

ఎంతో మంది త్యాగాలు చేయడం వలన వచ్చిన స్వాతంత్రం మనది. 
స్వాతంత్రం వచ్చ్చిన తరువాత  దేశ పురోభివృద్దికై అహర్నిశలూ పనిచేస్తూ ముందుకుపోతున్నాము.  తెలియకపోతే ఈ క్రింద ఇవ్వబడిన్ రెండవ వీడియో చూడండి.  

వాస్తవాలు తెలుసుకోవాలి అంతేకాని,  ఏమీ తెలుసుకోకుండా .......
ప్రజలు ఎన్నుకున్న గొప్ప వ్యక్తుల గురించి అనవసరమైన విషయాలు మీడియా ముందు మాట్లాడటం మంచిది కాదేమో...... దయచేసి ఆలోచించండి....


మన అభివృద్ది, మన కళ్లెదుటే ఉన్నది.
దేశ సంపదలో 40 శాతం మాత్రమే కొంతమంది (ఒక శాతం) చేతులల్లో ఉన్నది అంటున్నారు కానీ..... . మిగతా సంపద మొత్తం  మనచేతుల్లోనే ఉన్నది, (ఈ నివేదికను చదవండి.)

కావున...
ప్రజానాయకులను తూర్పారబట్టడం కన్నా సంపద 60 శాతం మనచేతుల్లో ఉంచినందుకు ఎల్లవేళలో గౌరవింఛాలి....
అంతేకాదు నిజమైన ప్రజాస్వామ్యులము అని మనల్ని మనం నిరూపించుకోవాలన్నా అలాగే 
ఏమాత్రము ప్రజాస్వామ్యముపై విశ్వాసమున్నా......
మన నాయకులను సదా పూజించడం మాత్రం మరావకూడదు.
అలా చేసిన యెడల పుణ్యలోకాలు ఎమోకానీ
ఈ లోకములో మంచి భవిష్యత్తు గ్యారంటీగా ఉంటుంది.

ఎలాగంటే ...
మంచి మంచి కాంట్రాక్టులు దొరకవచ్చు, లేక చౌకగా భూములు దొరకవచ్చు
లేకపోతే ప్రజలను చైతన్యపరిచి వారిచే ఓటు వేయించడానికి కావలసిన ద్రవ్యం దొరకవచ్చు.
ఏదో ఒకటి .... ఎలాగోలాగ బ్రతకడానికి కావలసిన ...
కాదు కాదు బలవడానికి కావలసిన వనరులు దొరుకుతాయి.

ఉద్యోగులకైతే మంచి పోస్టింగులు దొరుకుతాయి.
కూర్చోడానికి చక్కనైన సోఫాలు ఉంటాయి
బెల్లు కొట్టినవెంటనే రావడానికి ఇద్దరు ముగ్గురు ఉద్యోగులు ఉంటారు...... అలాగే...
తిరగడానికి కారు ఉంటుంది ... 
చక్కగా దర్పం ప్రదర్శించవచ్చు అలాగే పనులు చేయించుకోవచ్చు.



మన జీవన విధానం చాలా బాగుంది......  మన సమాజం కూడా చాలా చక్కగా ఉన్నది........ వీలైతే వినండి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.