ఒక ఉదయంలో నా హృదయంలో | చిత్రం: కల్పన (1977)

విషయసూచిక(toc)

సంగీతం: చక్రవర్తి
గీత రచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు

పల్లవి:

ఇది నా కల్పన.. కవితాలాపన.. ఆ..ఆ..ఆ..ఆ..ఆ

ఒక ఉదయంలో... నా హృదయంలో
ఒక ఉదయంలో... నా హృదయంలో
విరిసిన మందారం.. మెరిసిన సింధూరం..
విరిసిన మందారం.. మెరిసిన సింధూరం..

కల్పనా.. అది ఒక కల్పన.. అది నా కల్పన

ఒక ఉదయంలో... నా హృదయంలో
విరిసిన మందారం.. మెరిసిన సింధూరం..

చరణం 1:

తార తారకి నడుమ ఆకాశం ఎందుకో
పాట పాటకి నడుమ ఆవేశం ఎందుకో..

తార తారకి నడుమ ఆకాశం ఎందుకో
పాట పాటకి నడుమ ఆవేశం ఎందుకో..

మనిషి మనిషికీ మద్య మనసనేది ఎందుకో
మనసే గుడిగా.. మనిషికి ముడిగా..
మమత ఎందుకో.. మమత ఎందుకో..

తెలియని ఆవేదనే ఆలాపన
తెలుసుకున్న వేదనే కల్పనా..
అది ఒక కల్పన.. అది నా కల్పన...

ఒక ఉదయంలో... నా హృదయంలో
విరిసిన మందారం.. మెరిసిన సింధూరం..

చరణం 2:

దివ్వె దివ్వెలో వెలుగు నీ రూపం పొందితే
పువ్వు పువ్వునా మధువు నీ కోసం పొంగితే

దివ్వె దివ్వెలో వెలుగు నీ రూపం పొందితే
పువ్వు పువ్వునా మధువు నీ కోసం పొంగితే

కవి మనస్సులో ఉషస్సు కారు చీకటౌతుంటే
మిగిలిన కథలో.. పగిలిన ఎదలో..
ఈ కవితలెందుకో.. కవితలెందుకో..

తెలియని ఆవేదనే ఆలాపన
తెలుసుకున్న వేదనే కల్పనా..
అది ఒక కల్పన.. అది నా కల్పన..

ఒక ఉదయంలో... నా హృదయంలో
విరిసిన మందారం.. మెరిసిన సింధూరం..
విరిసిన మందారం.. మెరిసిన సింధూరం..

కల్పనా.. అది ఒక కల్పన.. అది నా కల్పన
Telugu Songs

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.