సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల
పల్లవి:
నీ తొలిచూపులోనే..ఏ....
ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా..
వాడిన వన్నెల వలపుల కుంకుమ తిలకాలుగా దిద్దుకోనా..
నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీటు వేళా
నా తొలిచూపుతోనే..ఏ..ఏ..
నింగిని నేలకు వంచిన చెక్కిట చిరు చుక్కగా ఉండిపోనా...
అల్లుకుపోయిన ఆశల ముంగిట తొలిముగ్గులే దిద్దుకోనా..
నీ శ్రుతిలో సుస్వరమై..నీ లయలో... మనసుయ్యాలగా ఊగు వేళా..
చరణం 1:
చిగురు సొగసు చిదిమితేనే... దీపమవ్వాలి నా కంటికీ
తొడిమలన్నీ పూలు తొడిగీ..తొలకరించాలి నీ నవ్వుకీ..
నీలి నింగీ..తెల్ల మబ్బూ..గొడుగు పట్టాలి నీ రాకకీ...
వాగువంకా వెల్లి విరిసీ మడుగులొత్తాలి నీ కాళ్ళకీ..
కన్నులలో..ఆ ఆ ఆ..హారితివై..ఆ ఆ ఆ
కౌగిలిలో..ఆ ఆ ఆ..శ్రీమతివై..ఆ ఆ ఆ
కరిగేది ఎన్నాళ్ళకో..
మది ఆలాపనై సాగు వేళా...
నీ తొలిచూపులోనే.. నింగిని నేలకు వంచిన చెక్కిట చిరు చుక్కగా ఉండిపోనా...
చరణం 2:
కోకిలమ్మ కొత్త చీరా సారెలడగాలి మన పెళ్ళికీ
కోనసీమ కొబ్బరాకు పందిరెయ్యాలి మన ఇళ్ళకీ
మాఘమాసాలు ముందు రావాలి..మంచి లగ్గాలు చూసీ
రామచిలకల్ల ప్రేమపలుకుల్లు పెళ్ళి మంత్రాలు చేసీ...
కలలన్నీ..ఆ ఆ ఆ..కాపురమై..ఆ ఆ ఆ
మమతలకే..ఆ ఆ ఆ..గోపురమై..ఆ ఆ ఆ
కరిసేది ఎన్నాళ్ళకో..
శుభశకునాలు పలికేటి వేళా
నా తొలిచూపుతోనే.. ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా
అల్లుకుపోయిన ఆశల ముంగిట తొలి ముగ్గులే దిద్దుకోనా
నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీటు వేళా......