Increments - Promotions

వాస్తవానికి స్కేల్ వల్ల కలిగే ప్రయోజనం చాలా పరిమితం. తాత్కాలికం. మీరు స్కేల్ నీ దృష్టిలో ఉంచుకుని ప్రమోషన్ ఛానెల్ ను ఆలోచించడం, అది మంచిది అనుకోవడం పూర్తిగా wrong thinking అనే చెప్పాలి. 

పదోన్నతి వల్ల వచ్చే ప్రయోజనం రెండు ఇంక్రిమెంట్ల కు సమానమైన లబ్ది. మన స్కేల్ తో సంబంధం లేకుండా ఎవరికైనా కలిగే సమానమైన లబ్ది ఇది. 

పెద్ద స్కేల్ ఉండటం వల్ల కొందరికి భారీ లబ్ది కలిగి ఉండొచ్చు. అది పూర్తిగా అదృష్టం మాత్రమే. కేవలం ఒక 10% ఆ అదృష్టం కలుగుతుంది. కానీ, అందరికీ రాదు.

ప్రమోషన్ ఛానెల్ కోసం మొదటగా ఆలోచించాల్సిన పాయింట్ మనకు ఎన్ని పోస్టులు అందుబాటులో ఉంటాయి అనేది. ఆ తర్వాత మాత్రమే ఆ పోస్ట్ స్కేల్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. తక్కువ పోస్టులు ఉన్నప్పుడు ఆ పోస్ట్ స్కేల్ ఎంత ఉన్నా కూడా ప్రయోజనం సున్నా. కొద్ది మందికి పదోన్నతులు వస్తాయి. వారు భారీగా లబ్ది పొందుతారు. మరి మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? సగం మంది రిటైర్మెంట్ లోపు ఒక్క పదోన్నతి కూడా పొందకుండానే సర్వీస్ ముగిసిపోతుంది. 

ఉదాహరణకు agriculture assistant లకు ఇచ్చిన పదోన్నతి ఛానెల్ చూసుకుంటే రాబోయే 25-30 ఏళ్లలో 3000 - 4000 మందికి మాత్రమే పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. మరి మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? VAA లు గానే రిటైర్ అయిపోతారు. ఈ పరిస్థితి నాలుగైదేళ్ల లో బోధ పడుతుంది. అప్పుడు వారు మీకు ఉన్నట్లే మాకు గ్రేడ్ లు క్రియేట్ చేయండి అంటూ డిమాండ్ చేస్తారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.