తిరుమల మందిర సుందరా | చిత్రం : మేనకోడలు (1972)

విషయసూచిక(toc)Telugu Songs

సంగీతం :  ఘంటసాల
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  సుశీల

పల్లవి:

తిరుమల మందిర సుందరా..  సుమధుర కరుణా సాగరా
ఏ పేరున నిను పిలిచేనురా.. ఏ రూపముగా కొలిచేనురా

చరణం 1:

పాలకడలిలో శేష శెయ్యపై పవళించిన శ్రీపతివో

వెండికొండపై నిండుమనముతో వేలిగే గౌరీపతివో
ముగురమ్మలకే మూలపుటమ్మగ భువిలో వెలసిన ఆదిశక్తివో
తిరుమల మందిర సుందరా.. సుమధుర కరుణా సాగరా

చరణం 2:

కాంతులు చిందే నీ ముఖ బింబం కాంచిన చాలును గడియైనా

నీ గుడి వాకిట దివ్వెను నేనై వెలిగిన చాలును ఒక రేయైనా
నీ పదముల పై కుసుము నేనై నిలచిన చాలును క్షణమైనా

తిరుమల మందిర సుందరా.. సుమధుర కరుణా సాగరా
ఏ పేరున నిను పిలిచేనురా.. ఏ రూపముగా కొలిచేనురా
తిరుమల మందిర సుందరా.. సుమధుర కరుణా సాగరా

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.