సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి:
కంచికి పోతావా కృష్ణమ్మా... ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా..
కంచికి పోతావా కృష్ణమ్మా... ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా..
కంచిలో వున్నది బొమ్మ... అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ..
కంచికి పోతావా కృష్ణమ్మా ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలో వున్నది బొమ్మ అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ..
కంచికి పోతావా కృష్ణమ్మా........
చరణం 1 :
మ్మ్ మ్మ్ ... ఆ ఆ ఆ ఆ అహాహా...
ఆ ఆ...త్యాగరాజ కీర్తనల్లె వున్నాదీ బొమ్మ.. రాగమేదో తీసినట్టు వుందమ్మా
త్యాగరాజ కీర్తనల్లె వున్నాదీ బొమ్మ.. రాగమేదో తీసినట్టు వుందమ్మా
ముసి ముసి నవ్వుల పువ్వులు పూసిందీ కొమ్మ... మువ్వ గోపాలా..
మువ్వ గోపాలా.. మువ్వ గోపాల.. అన్నట్టుందమ్మా...
అడుగుల్ల సవ్వళ్ళు కావమ్మా.. అవి ఎడదల్లో సందళ్ళు లేవమ్మా
అడుగుల్ల సవ్వళ్ళు కావమ్మా.. అవి ఎడదల్లో సందళ్ళు లేవమ్మా
కంచికి పోతావా కృష్ణమ్మా ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలో వున్నది బొమ్మ అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ..
కంచికి పోతావా కృష్ణమ్మా........
చరణం 2 :
రాసలీల సాగినాక రాధ నీవేనమ్మ.. రాతిరేళ కలత నిదర రాదమ్మా
రాసలీల సాగినాక రాధ నీవేనమ్మ.. రాతిరేళ కలత నిదర రాదమ్మా
ముసిరిన చీకటి ముంగిట వేచిందీ కొమ్మా.. ముద్దు మురిపాల...
మువ్వ గోపాలా... నీవు రావేలా.. అన్నట్టుందమ్మా
మనసు దోచుకున్న ఓ యమ్మ.. నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా
మనసు దోచుకున్న ఓ యమ్మ.. నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా
కంచికి పొతావ కృష్ణమ్మా... ముద్దు మురిపాలా...
ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా.. మువ్వ గోపాలా...
కంచిలో వున్నది బొమ్మ... అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ..
నీవు రావేలా.... కంచికి పోతావా కృష్ణమ్మా...ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా