చీకటి వెలుగుల కౌగిటిలో | చిత్రం: చీకటి వెలుగులు (1975)

విషయసూచిక(toc)Telugu Songs
సంగీతం: చక్రవర్తి 
గీతరచయిత: దేవులపల్లి 
నేపధ్య గానం: బాలు, సుశీల 

పల్లవి: 

చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలూ 
చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలూ 
ఏకమైనా హృదయాలలో ఓ ఓ ఏకమైనా హృదయాలలో 
పాకే బంగరు రంగులు.. 

ఈ మెడ చుట్టూ గులాబీలూ..ఈ సిగపాయల మందారాలూ 
ఈ మెడ చుట్టూ గులాబీలూ..ఈ సిగపాయల మందారాలూ 
ఎక్కడివీ రాగాలూ ..చిక్కని ఈ అరుణ రాగాలూ 
అంది అందని సత్యాల ..సుందర మధుర స్వప్నాలా.. 

చరణం 1: 

తేట నీటి ఈ ఏటి ఒడ్డునా 
నాటిన పువ్వుల తోటా 
నిండు కడవల నీరు పోసీ 
గుండెల వలపులు కుమ్మరించీ 
ప్రతి తీగకు చేయూతనిచ్చీ 
ప్రతి మాను పులకింప చేసీ 

మనమే పెంచినదీ తోటా 
మరి ఎన్నడు వాడనిదీ తోటా 
మనమే పెంచినదీ తోటా 
మరి ఎన్నడు వాడనిదీ తోటా 

మరచి పోకుమా తోటమాలీ 
పొరపడి అయినా మతిమాలీ 
మరచి పోకుమా తోటమాలీ 
పొరపడి అయినా మతిమాలీ 

చరణం 2: 

ఆరు ఋతువులు ఆమని వేళలే మన తోటలో 
అన్ని రాత్రులు పున్నమి రాత్రులే మన మనసులో 
మల్లెలతో వసంతం ..చేమంతులతో హేమంతం 
మల్లెలతో వసంతం ..చేమంతులతో హేమంతం 

వెన్నెల పారిజాతాలు వానకారు సంపెంగలూ 
వెన్నెల పారిజాతాలు వానకారు సంపెంగలూ 
అన్ని మనకు చుట్టాలేలే..వచ్చే పోయే అతిధులే 
అన్ని మనకు చుట్టాలేలే..వచ్చే పోయే అతిధులే 

ఈ మెడ చుట్టూ గులాబీలు..ఈ సిగపాయల మందారాలూ 
ఎక్కడివీ రాగాలూ చిక్కని ఈ అరుణ రాగాలూ 
ఎక్కడివీ రాగాలూ చిక్కని ఈ అరుణ రాగాలూ 

చరణం 3: 

గల గల మన కూడదూ..ఆకులలో గాలీ 
జల జల మనరాదూ ..అలలతో కొండవాగూ 
నిదరోయే కొలను నీరూ.. నిదరోయే కొలను నీరూ 
కదపకూడదూ ఊ ఊ 
ఒదిగుండే పూలతీగా..ఊపరాదూ 

కొమ్మపైనిట జంట పూలూ 
గూటిలో ఇక రెండు గువ్వలూ 

ఈ మెడ చుట్టూ గులాబీలూ 
ఈ సిగపాయల మందారాలూ 
ఎక్కడివీ రాగాలు.. 
చిక్కని ఈ అరుణ రాగాలూ 
మరచిపోకుమా తోటమాలీ 
పొరపడి అయినా మతిమాలి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.