సామెతలు


వికీపీడియా నుండి - సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలు మాటల రుచినిపెంచే తిరగమోత, తాలింపు దినుసులు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు కాబట్టి సామెతలు ప్రజల అనుభవ సారాలు. సామెతలు నిప్పులాంటి నిజాలు. నిరూపిత సత్యాలు. ఆచరించదగ్గ సూక్తులు.

సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").  ఇక్కడ కొన్ని సామెతల జాబితా ఇవ్వబడ్డది. .


  • అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అట
  • అంత్య నిష్టూరం కన్నా, ఆది నిష్టూరం మేలు
  • అందని పండ్లకు అర్రులు చాచినట్లు
  • అందని ద్రాక్షలు పుల్లన
  • అందితే సిగ అందకపోతే కాళ్ళు
  • అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు
  • అంబలి తాగేవాడికి మీసాలు ఎక్కు పెట్టేవాడు ఒకడు
  • అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలన్నీ మాయం
  • అంధుడికి అద్దం చూపించినట్లు
  • అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కర తీరేక గూదనారాయణ
  • అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం
  • అగ్నికి వాయువు తోడైనట్లు
  • అటునుండి నరుక్కు రా
  • అడకత్తెరలో పోకచెక్క
  • అడగందే అమ్మ అయినా పెట్టదు
  • అడగందే అమ్మైనా (అన్నం) పెట్టదు
  • అడిగేవాడికి చేప్పేవాడు లోకువ
  • అడుక్కునేవాడికి అరవైఆరు కూరలు
  • అడుక్కునేవాడిదగ్గర గీక్కునేవాడు
  • అడుసు తొక్కనేల కాలు కడగనేల
  • అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు
  • అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న
  • అతి వినయం ధూర్త లక్షణం
  • అతిరహస్యం బట్టబయలు
  • అత్త సొమ్ము అల్లుడు దానం
  • అత్తమీద కోపం దుత్తమీద తీర్చుకున్నట్లు.
  • అత్తరు పన్నీరు గురుగురులు దాని దగ్గరకు పోతే లబలబలు
  • అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు
  • అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు
  • అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లు
  • అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు
  • అద్దం అబద్ధం ఆడుతుందా !
  • అనగా అనగా రాగం తినగా తినగా రోగం
  • అనువుగాని చోట అధికుల మన రాదు
  • అనుమానం పెనుభూతం
  • అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట
  • అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు మధ్యనున్న వారే నలిగిపోయారన్నట్లు
  • అన్నం పెట్టేవాడు దగ్గరుండాలి దణ్ణం పెట్టేవాడు దూరంగా ఉన్నా పర్వాలేదు
  • అన్నం చొరవే గానీ అక్షరం చొరవ లేదు
  • అన్నీ ఉన్న ఆకు అణగి మణగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది
  • అన్నీ సాగితే రోగంమంత భోగము లేదు
  • అపానవాయువును అణిచిపెడితే ఆవులింతలు ఆగుతాయా?
  • అప్పటికి దుప్పటిచ్చాముగానీ కలకాలం ఇస్తామా?
  • అప్పనుచూడబోతే రెప్పలు పోయినై
  • అప్ప సిరిచూసుకొని మాచి మడమలు తొక్కింది
  • అక్కా పప్పు వండవే చెడేవాడు బావ ఉన్నాడు గదా?
  • అప్పిచ్చువాడు వైద్యుడు
  • అప్పిచ్చి చూడు ఆడపిల్లనిచ్చిచూడు
  • అప్పు నిప్పులాంటిది...
  • అప్పు పత్రానికి ఆన్సరుందిగానీ చేబదులుకి ఉందా?
  • అప్పు చేసి కొప్పు తీర్చిందట
  • అప్పుచేసి పప్పు కూడు
  • అప్పులేని వాడే అధిక సంపన్నుడు
  • అప్పులవాడిని నమ్ముకొని అంగడికి, మిండమగడిని నమ్ముకొని జాతరకు పోకూడదు
  • అప్పులున్నాడితోను చెప్పులున్నాడితోను నడవొద్దు
  • అబద్ధము ఆడితే అతికినట్లుండాలి
  • అభ్యాసము కూసువిద్య
  • అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?
  • అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు
  • అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు
  • అమ్మబోతే అడవి కొనబోతే కొరివి
  • అయితే అంగలూరు కాకపోతే సింగలూరు
  • అయిదుగురు పట్టంగ ముఫ్పై ఇద్దరు రుబ్బంగ ఒకడు తొయ్యంగ గుండువెళ్ళి గుండావతిలో పడింది
  • అయిదోతనం లేని అందం అడుక్కుతిననా?
  • అయినోళ్లకి ఆకుల్లో, కానోళ్ళకి కంచంలో
  • అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకు
  • అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టు
  • అరఘడియ భోగం ఆర్నెల్ల రోగం
  • అరచేతిలో వైకుంఠం చూపినట్లు
  • అవ్వాకావలెను బువ్వా కావలెను
  • అరచేతిలో వెన్నపెట్టుకొని నెయ్యికోసం వూరంతా తిరిగినట్లు...
  • అరిచే కుక్క కరవదు
  • అరటిపండు ఒలచి చేతిలొ పెట్టినట్ట్లు
  • అర్దరాత్రి మద్దెల దరువు
  • అలకాపురికి రాజైతే మాత్రం అమితంగా ఖర్చు చేస్తాడా...
  • అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టం
  • అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట
  • అసలు లేవురా మగడా అంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట
  • అసలే కోతి,ఆపై కల్లు తాగినట్టు
  • అసలే లేదంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట
  • అడుక్కునేవాడింటికి బుడబుక్కల వాడు వచ్చినట్టు.
  • ఆ తాను ముక్కే
  • ఆంతా ఆతాను ముక్కే
  • ఆ మొద్దు లోదే ఈ పేడు
  • ఆంబోతులా పడి మేస్తున్నావు
  • ఆకలని రెండు చేతులతో తింటామా అన్నట్లు
  • ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరుగదు
  • ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు, వలపు సిగ్గెరగదు
  • ఆకలివేస్తే రోకలి మింగమన్నాడంట
  • ఆకారం చూసి ఆశపడ్డానే కానీ... అయ్యకు అందులో పసలేదని నాకేం తెల్సు అన్నాట్ట...
  • ఆకారపుష్టి నైవేద్యనష్టి
  • ఆకు వెళ్ళి ముల్లు మీద పడ్డా, ముల్లు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం
  • ఆకులు నాకేవాడింటికి మూతులు నాకేవాడు వాచ్చాడట
  • ఆకులేని పంట అరవైఆరు పుట్లు...
  • ఆడది తిరిగి చెడుతుంది,మగవాడు తిరక్క చెడతాడు
  • ఆడపిల్ల పెళ్ళి, అడుగు దొరకని బావి అంతం చూస్తాయన్నట్లు...
  • ఆడబోయిన తీర్థమెదురైనట్లు
  • ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు
  • ఆత్రగాడికి బుద్ది మట్టం
  • ఆత్రపు పెళ్ళికొడుకు అత్త మెళ్ళో తాళి కట్టినట్లు
  • ఆరాటపు పెళ్ళికొడుకు పెరంటాళ్ళ వెంట పడ్డ్డాడట
  • ఆదిలోనే హంసపాదు
  • ఆపదలో మొక్కులు... సంపదలో మరపులు
  • ఆమడదూరం నుంచి అల్లుడు వస్తే మంచం కింద ఇద్దరు, గోడమూల ఒకరు దాగుంటారు
  • ఆ మరకా ఈ మరకా అడ్డగోడకి, ఆ మాటా ఈ మాటా పెద్దకోడలకి
  • ఆయనే ఉంటే మంగలి ఎందుకు
  • ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ
  • ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు
  • ఆరోగ్యమే మహాభాగ్యం
  • ఆలస్యం అమృతం విషం
  • ఆలి బెల్లమాయె తల్లి అల్లమాయె
  • ఆలికి అన్నంపెట్టి, ఊరికి ఉపకారంచేసినట్లు చెప్పాట్ట
  • ఆలు బిడ్డలు అన్నానికి ఏడుస్తుంటే... చుట్టానికి బిడ్డలు లేరని రామేశ్వరం పోయాడట.
  • ఆలూలేదు చూలులేదు కొడుకుపేరు సోమలింగం
  • ఆవు చేలో మేస్తే, దూడ దుగాన/గట్టున మేస్తుందా?
  • ఆవుకు, దూడకు లేని బాధ గుంజకెందుకో?
  • ఆవులింతకు అన్నలు ఉన్నారు కాని, తుమ్ముకు తమ్ముడు లేడు
  • ఆవులిస్తే ప్రేగులు లెక్క పెట్టే రకం
  • ఆశగలమ్మ దోషమెరుగదు... పూటకూళ్లమ్మ పుణ్యమెరుగదు
  • ఆవు చేల్లో మేస్తే దూడ గట్టున మేయునా?
  • ఇంత లావున్నావు తేలు మంత్రం కూడ తెలియదా?
  • ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్లు
  • ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు
  • ఇంటికన్నా గుడి పదిలం
  • ఇంటికి ఇత్తడి పురుగుకు పుత్తడి
  • ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లకీల మోత
  • ఇంట్లో పిల్లి వీధిలో పులి
  • ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య
  • ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు
  • ఇద్దరు ముద్దు ఆపై వద్దు
  • ఇద్దరే సత్పురుషులు, ఒకడు పుట్టనివాడు, ఇంకొకడు గిట్టినవాడు
  • ఇరుపోటీలతోటి ఇల్లు చెడె, పాత నొప్పులతోటి ఒళ్ళు చెడె
  • ఇల్లలకగానే పండగకాదు
  • ఇల్లలుకుతూ పేరు మర్చిపోయినట్లు
  • ఇల్లు ఇచ్చినవాడికి, మజ్జిగ పోసినవాడికి మంచిలేదు
  • ఇల్లు ఇరుకుగా ఉండాలి, పెళ్ళాం ఛ0ఢాలంగా ఉండాలి
  • ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే,వల్ల కాలేదని ఒకడు ఏడ్చాడంట
  • ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే ఏదో కావాలని ఎవడో ఏడ్చాడట
  • ఇల్లుకాలి ఒకడేడుస్తుంటే, చుట్టకి నిప్పు అడిగాడంటొకడు
  • ఇల్లు ఇరకాటం ఆలి మర్కటం
  • ఇల్లు పీకి పందిరి వేసినట్లు
  • ఇసుక తక్కెడ పేడ తక్కెడ
  • ఇల్లలకగానే పండగ కాదు
  • ఇంటి ముందు ములగ చెట్టు వెనుక వేప చెట్టు ఉండరాదు
  • ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేదు
  • ఈశ్వరుడుకి విభూది లెకుంటె పార్వతి పాండ్స్ అడిగినట్లు
  • ఉట్టి గొడ్డుకి అరుపులెక్కువన్నట్లు
  • ఉట్టి గొడ్డుకి ఆకలెక్కువన్నట్లు
  • ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు
  • ఉపాయం లేని వాడిని ఊళ్ళోనంచి వెళ్ళగొట్టమన్నారు
  • ఉన్న మాటంటే ఉలుకెక్కువ
  • ఉన్నది పోయె ఉంచుకొన్నది పోయె
  • ఉయ్యాల్లొ పిల్ల పెట్టుకుని ఊరంతా వెతికినట్టు
  • ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు
  • ఉల్లి చేసే మేలు తల్లికూడా చెయ్యదు
  • ఊరు ఊరు పోట్లాడుకుని మంగలం మీద పడి ఏడ్చినట్టు
  • ఊపిరి ఉంటే ఉప్పుకల్లు అమ్ముకొని బ్రతకచ్చు
  • ఊపిరి పోతూంటే ముక్కులు మూసినట్లు
  • ఊరంతా ఉల్లి నీవెందుకే తల్లీ
  • ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెదొక దారి
  • ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది
  • ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుఖం లేదు
  • ఊళ్ళో పెళ్ళికి ఇంట్లో సందడి
  • ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి
  • ఊరుకున్న శంఖాన్ని ఊది చెడగొట్టినట్లు
  • ఊరికి ఉపకారి ఆలికి అపకారి
  • ఊరికి చేసిన ఉపకారం శవానికి చేసిన శృంగారం వృదా.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.