స్వప్న వేణువేదో | చిత్రం: రావోయి చందమామ (1999)

విషయసూచిక(toc)

సంగీతం:  మణి శర్మ
గీతరచయిత:  వేటూరి 
నేపథ్య గానం: బాలు, చిత్ర

పల్లవి :

స్వప్న వేణువేదో సంగీతమాలపించే
సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే
జోడైన రెండుగుండెల ఏకతాళమో
జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో
లే లేత పూలబాసలు కాలేవా చేతిరాతలు

స్వప్న వేణువేదో సంగీతమాలపించే
సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే 

చరణం 1:

నీదే ప్రాణం నీవే సర్వం నీకై చేశా వెన్నెల జాగారం
ప్రేమ నేడు రేయి పగలు... హారాలల్లే మల్లెలు నీకోసం

కోటి చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చూచు వేళ
నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరానా
కాలాలే ఆగిపోయినా... గానాలే మూగబోవునా

చరణం 2:

నాలో మోహం రేగే దాహం... దాచేదెపుడో పిలిచే కన్నుల్లో
ఓడే పందెం గెలిచే బంధం... రెండూ ఒకటే కలిసే జంటల్లో

మనిషి నీడగా మనసు తోడుగా మలచుకున్న బంధం
పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలీ తీరం
వారేవా ప్రేమ పావురం... వాలేదే ప్రణయ గోపురం

స్వప్న వేణువేదో సంగీతమాలపించే
సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే
జోడైన రెండుగుండెల ఏకతాళమో
జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో
లే లేత పూలబాసలు కాలేవా చేతిరాతలు

స్వప్న వేణువేదో సంగీతమాలపించే
సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే 
Telugu Songs

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.