వేసవి : వేసవిలో చద్దన్నం తింటే...

వేసవి :  వేసవిలో చద్దన్నం తింటే... ఆరోగ్య ప్రయోజనాలెన్నో!


ప్రజాశక్తి ఇంటర్నెట్‌డెస్క్‌: వేసవిలో చద్దన్నం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ కాలంలో ప్రతిరోజూ ఉదయాన్నే చద్దన్నం తింటే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

చద్దన్నం వల్ల ప్రయోజనాలు వేసవిలో వండిన అన్నం త్వరగా పులిసిపోతుంది. రాత్రి వండిన అన్నాన్ని మజ్జిగలో వేసి మరుసటిరోజు తింటే రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఉదయాన్నే ఈ అన్నంలో మరికొంత పెరుగు వేసుకుని.. మిరపకాయ, ఉల్లిపాయతో నంజుకుని తింటే టేస్టీగా ఉంటుంది. చద్దన్నం తింటే తక్షణ శక్తి వస్తుంది. దీన్ని తినడం వల్ల డీహైడ్రేషన్‌, అలసట, బలహీనతను దూరం చేసే శరీరంలోని ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుంది.

- చద్దన్నంలో పొటాషియం, సోడియం, క్లోరైడ్‌, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి.

- చద్దన్నం తింటే ఎముకల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. అలాగే పలు రకాల ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్‌ వంటి ప్రమాదకరమైన వ్యాధులను కూడా నివారించేందుకు సహాయపడుతుంది.


సౌజన్యం: ప్రజాశక్తి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.