పెన్షన్ ప్రపోజల్స్ – Teachers

సకాలంలో  పెన్షన్ ప్రపోజల్స్ పంపించక/దృష్టి సారించక రిటైర్ అయిన 3/4/5/6/7 నెలలకు కూడా పెన్షన్/గ్రాట్యుటీ/కమ్యుటేషన్ పొందలేక నష్ట పోతున్న విషయాన్ని గమనించడమైనది.  అందువలన అవగాహన నిమిత్తం కొంత ప్రాథమిక సమాచారం:-

1) నెలలో 2వ తేదీ మరియు ఆతరువాత పుట్టిన వారు 62 సం॥లు పూర్తవగానే ఆ నెల చివరి తేదీనే పదవీవిరమణ తేదీగా భావించాలి. కానీ 1వ తేదీ పుట్టిన వారికి మాత్రం ముందు నెల 30/31వ తేదీలకు 62సం॥లు పూర్తవుతాయి కాబట్టి ముందు నెల చివరి రోజును రిటైర్ మెంట్ రోజుగా పరిగణించాలి.చనిపోయిన వారి విషయంలో చనిపోయిన రోజును కూడా పరిగణనలోనికి తీసుకోవాలి.

2) రిటైర్మెంట్ కు 6 నెలల ముందుగానే SRను అప్డేట్ చేసి పెన్షన్ ప్రపోజల్స్ AGఆఫీసుకు పంపవచ్చు. ఈ 6 నెలల్లో ఇంక్రిమెంట్ ఉన్ననూ అడ్వాన్స్ గా నమోదు చేసి పంపవచ్చు.

3) ఒక నెలలో రిటైర్ అయ్యేవారి ఇంక్రిమెంట్ కనుక వెంటనే మరుసటి నెలలో ఉన్నట్లయితే, GO No:235 27-10-1998 ప్రకారం ఒక ఇంక్రిమెంటును మంజూరు చేయాలి. (ఇది కేవలం పెన్షన్, గ్రాట్యుటీ,కమ్యుటేషన్ లకు మాత్రమే వర్తిస్తుంది)

4) పెన్షన్ ప్రతిపాదనలు ప్రాథమిక & ప్రాథమికోన్నత పాఠశాలల టీచర్లవి MEOలు, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులవి HMలు నేరుగా AGఆఫీసు-విజయవాడకు పంపవచ్చు. DEO ఆఫీసుకు అవసరం లేదు. HM & MEO లవి మాత్రం Dy.EO, DEO ద్వారా AGఆఫీసుకు పంపాలి. ఎయిడెడ్ ఉపాధ్యాయులు మాత్రం DEO ద్వారానే పంపాలి.

6) 398/- స్పెషల్ టీచర్ల సర్వీసును, అప్రెంటీస్ సర్వీసును కూడా పెన్షన్ కు పరిగణిస్తారు.

7) సర్వీసు 33సం॥లకు తగ్గినచో 5 సం॥ల వెయిటేజీ కలుపబడును. (VRS ఇచ్చేవారికి కూడా)

8) పెన్షన్ కు చివరి బేసిక్ పే ను మాత్రమే పరిగణనలోనికి తీసుకుంటారు.

9) ఉద్యోగి చనిపోయినపుడు అర్హతగల కుటుంబసభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ (CPSవారికి కూడా) వస్తుంది. గ్రాట్యుటీ కుటుంబసభ్యులకు పంచుతారు. వీరికి కమ్యుటేషన్ వర్తించదు. (ఈ కేసులలో DTO ఆఫీసునకు  క్లియర్ గా ఉండే కుటుంబ సభ్యుల Aadhar, PAN, Bank Passbook, Photo, చదివిన విద్యార్హతల సర్టిఫికెట్స్, CFMS ID తో చేర్చాలి)

10) AG ఆఫీసువారు పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ ను శాంక్షన్ చేసి, DTO ద్వారా STO లకు పంపుతారు.

11) పెన్షన్ ఫైల్ STOలకు చేరిన తరువాత AG ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన PPO ఒరిజినల్ కాపీ, Non-Drawl & No Dues Certificates by DDO (district ఆఫీస్ నందు జీతం తీసుకునే వారు మాత్రం Non Drawl DTO గారి నుండి తీసుకోవాలి), Annexure-1, Life Certificate, Declaration Forms-2&3, Bank Pass Book Xerox Copy, Aadhar & PAN Xerox, 3Photoes లతో STO ఆఫీసుకు వెళ్లి STOను కలవాలి

12) రిటైర్ అయిన వారి సర్వీస్ హెల్త్ కార్డు Cancel అవుతుంది కాబట్టి, పెన్షనర్ గా కొత్త హెల్త్ కార్డు పొందవలసిఉంటుంది. దీనికి గాను NTR వైద్యసేవాట్రస్టు వారికి మన రిటైర్ మెంట్ విషయాన్ని తెలియపరచి, వారిచ్చే పాస్ వర్డ్ తో లాగిన్ అయి పెన్షన్ పేస్లిప్, PPOకాపీ, ఫోటో,రిక్వెస్ట్ లెటర్ తదితరాలతో కొత్త హెల్త్ కార్డును తీసుకోవాలి.

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.