Leave Travel Concession - Important Points | ఎల్.టి.సి. నిబంధనలు

1. ఉద్యోగులు 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన తరువాతే ఎల్.టి.సి. వాడుకోవడానికి అర్హులు.

2. నాలుగు సంవత్సరాల (క్యాలెండర్ ఇయర్స్) కాలంలో మొదటి రెండు సంవత్సరాలు హోమ్ టౌన్, ఆ తరువాత రెండు సంవత్సరాలలో రాష్ట్రంలో ఎక్కడికైనా ఎల్.టి.సి. ని వాడుకోవచ్చును.

3. భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులయితే వారిలో ఒకరు మాత్రమే ఎల్.టి.సి ని వినియోగించుకోవచ్చు.

4. సాధారణంగా ఉద్యోగికి ఎవరైతే సెలవు మంజూరు చేస్తారో (సి.ఎల్ కాకుండా), ఆ అధికారి ఎల్.టి.సి. కూడా మంజూరు చేస్తారు.

5. ముందస్తు అనుమతి తీసుకొని ఎల్.టి.సి.  సౌకర్యంలో ప్రయాణం ప్రారంభించాలి.

6. కనీసం ఒక్కరోజైనా సెలవు పెట్టాల్సి ఉంటుంది (సెలవులో లేకుండా ఎల్.టి.సి. వినియోగించుకోడానికి వీలులేదు).

7. ఎన్జీవో / నాల్గవ తరగతి ఉద్యోగులపై పూర్తిగా ఆధారపడిన తల్లిదండ్రులను మాత్రమే కుటుంబ సభ్యులుగా ఉద్యోగితో పాటు ఎల్.టి.సి  సౌకర్య వినియోగంలో అనుమతిస్తారు.

8. గెజిటెడ్ ఉద్యోగుల విషయంలో వారి తల్లిదండ్రులు పూర్తిగా వీరిపై ఆధారపడియున్ననూ వారిని ఎల్.టి.సి. లో కుటుంబ సభ్యులుగా పరిగణించరు.

9. వివాహిత ఉద్యోగిని తల్లిదండ్రులు ఆమెపై ఆధారపడి ఉన్నచో వారిని ఎల్.టి.సి. వినియోగ విషయంలో కుటుంబసభ్యులుగా పరిగణించి అనుమతిస్తారు.

10. ఉద్యోగి తల్లిదండ్రులు, పెన్షనర్లు అయితే వారిని ఎల్.టి.సి. కి కుటుంబసభ్యులుగా పరిగణించరు.

11. 1.4.1996 తరువాత పిల్లల విషయంలో ఇద్దరి పిల్లలు మాత్రమే కంట్రోలింగ్ ఆఫీసర్, కుటుంబసభ్యుల ధృవీకరణను ఉద్యోగి నుండి తీసుకొని, అటెస్ట్ చేసి వారి సర్వీసు రిజిస్టర్లల్లో నమోదు చేయాలి.

12. ఎల్.టి.సి.  ప్రయాణంలో ఎక్కడికైతే వెళ్తామని తెలుపుతారో ఆ ఊరికి తప్పక వెళ్ళి రావాలి. అలాగే ఆ ప్రాంతము రాష్ట్ర సరిహద్దుల ఆవల ఉన్నచో, రాష్ట్ర సరిహద్దుల వరకు క్లైయిమ్ చేసుకోవడానికి వీలుంది.

13. ఎల్.టి.సి.  ప్రయాణం ప్రభుత్వ రవాణా వ్యవస్థ ద్వారా మాత్రమే చేయాలి. ప్రైవేటు సర్వీసు, అద్దె కారు, ప్రైవేటు టాక్సీ, మొదలగునవి అనుమతించరు.

14. ఎల్.టి.సి. కి అనుమతి ఉత్తర్వులు పొందిన ప్రాంతానికి రైలు సౌకర్యం ఉంటే రైలులో ప్రయాణం చేయాలి. ఒకవేళ రాష్ట్ర ఆర్టీసి మరియు ఎ.పి. టూరిజం కార్పొరేషన్ వాహనాలలో ప్రయాణిస్తే ఎల్.టి.సి. లో రైలుఛార్జీల మేరకే పరిమితం చేసి అనుమతిస్తారు.

15. ఎల్.టి.సి. వినియోగమై ఉత్తర్వులు పొందిన తరువాత ఉద్యోగి అవసరమని భావిస్తే ఎల్టిసి ప్రయాణ ఖర్చులలో 80% అడ్వాన్సుగా పొందవచ్చు.

16. ఎల్.టి.సి. బిల్లును 019 - ఎల్.టి.సి.  పద్దు క్రింద ఎ.పి.టి.సి. ఫారమ్ నెం. 52లో క్లైయిమ్ చేయాలి.

17. ఎల్.టి.సి. మొత్తం క్లెయిమ్ చేయడానికి ఎటువంటి డిటిఎ బడ్జెట్ ఆథరైజేషన్ (టి.ఎ. క్లైమ్ విషయంలో మాదిరిగా) అవసరం లేదు. ఎందుకంటే ఈ క్లైమ్ uncontrolled item of expenditure గా భావించబడుతుంది.

18. ఎల్.టి.సి. ప్రయాణం ముగిసిన తేదీ నుండి 30 రోజుల్లో బిల్ డి.డి.ఓ (డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారి) కి సమర్పించాలి. లేని పక్షంలో బిల్లులో 15% కోట విధిస్తారు (ఒక సంవత్సరము లోపల).

19. ఎల్.టి.సి. బిల్లుకు ఒరిజినల్ బస్ టికెట్లు కానీ, ట్రైన్ టికెట్లు కానీ తప్పక జతపరచవలెను.

20. ఎల్.టి.సి. వాడుకొన్నట్లు ఎస్.ఆర్.లో నమోదుచేసి దానిని సర్టిఫికెట్ రూపంలో బిల్లుతో బాటు జతపరచాలి.

21. జీ.ఓ.ఎం.ఎస్.నెం. 15 మరియు జీ.ఓ.ఎం.ఎస్.నెం. 247, ఎఫ్ & పి (ఎఫ్.డబ్ల్యు.టి.ఎ) శాఖ, తే. 20/09/1982 లో ఉన్న అన్ని ధృవపత్రాలు బిల్ లో రాయాలి.

22. ఎవరైతే పే స్కేలు రూ. 7770-17455 (ఆర్.పి.ఎస్ - 2005) లో ఉన్నారో (ఆటోమాటిక్ అడ్వాన్స్ మెంట్ స్కేల్ ను పరిగణలోకి తీసుకోరాదు, వారి ఒరిజినల్ పోస్టు స్కేల్ ను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి) వారు ట్రైన్లో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణం చేయవచ్చు. మిగతావారు సెకండ్ క్లాస్ లో ప్రయాణించాలి.

23. ఎల్.టి.సి. ప్రయాణ సమయంలో పై క్లాస్లో ప్రయాణించినా వారి అర్హత మేరకు క్లెయిం పరిమితి చేయాలి.

24. వెకేషన్ డిపార్టుమెంట్లో పనిచేసే ఉద్యోగులు వేసవి సెలవుల కాలంలో కూడా ఎల్.టి.సి. వినియోగించుకోవచ్చు - జీ.ఓ.ఎం.ఎస్. నెం. 208, ఎఫ్ & పి, తేది 25-05-1976.

25. జీ.ఓ.ఎం.ఎస్. నెం. 247, ఎఫ్ & పి, తేది 20.9.1982 ప్రకారం కంట్రోలింగ్ ఆఫీసరు, కుటుంబ సభ్యుల ధృవీకరణను ఉద్యోగి నుండి తీసుకుని, అటెస్ట్ చేసి వారి ఎస్.ఆర్.లో నమోదు చేయాలి.

26. ప్రతి ఉద్యోగి ఎల్.టి.సి. హోమ్ టౌన్ వినియోగించుకోవాలంటే హోమ్ టౌన్ నిర్ధారణ ఇచ్చి దానిని కూడా వారి ఎస్.ఆర్.లో నమోదు చేయవలసి ఉంటుంది.

27. ఎల్.టి.సి. ప్రయాణంను అతి దగ్గర మార్గంలో చేయాలి.

28. ఎల్.టి.సి.  వినియోగించుకొని, క్లెయిమ్ చేయకుండానే మరణించిన ఉద్యోగి వారసులకు క్లెయిమ్ చెల్లిస్తారు - మెమో నెం. 40872-సి/1338 టి.ఎ/83 ఎఫ్ & పి, తే.09-07-1984.

29. రూల్ 16 ప్రకారం ఎవరైనా ఎల్.టి.సి ని దుర్వినియోగం చేసినా అడ్వాన్స్ డ్రా చేసి ఎల్.టి.సి  పై వెళ్లకున్నా ఈ క్రింద తెలిపిన జరిమానా వేయవచ్చు   - జీ.ఓ.ఎం.ఎస్.నెం. 5 ఎఫ్ & పి (ఎఫ్ డబ్ల్యు టిఎ), తే. 7.1.1986.

         ఎ) తీసుకున్న అడ్వాన్స్ మరియు ఏడాదికి 18% పీనల్ ఇంట్రెస్ట్ కలిపి మొత్తం ఒక్కసారే చెల్లించాలి.

         బి) ఉద్యోగి మిగిలిన సర్వీస్ లో ఎల్.టి.సి వినియోగించుకునే సౌకర్యం లేకుండా చేస్తారు.

         సి) పైవి కాకుండా అధికారి భావిస్తే సి.సి.ఎ. రూల్స్ ప్రకారం క్రమ శిక్షణా చర్యలు కూడా తీసుకోవచ్చు.

30. ఉద్యోగి భార్య/భర్త ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. ఎంప్లాయి పాస్ కలిగి వినియోగించుకొంటే ఆ ప్రభుత్వ ఉద్యోగికి ఎల్.టి.సి సౌకర్యం అనుమతించబడదు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.