సహకార సంఘముల రిజిస్ట్రేషన్ విధానము
[సహకార సంఘముల చట్టము నందలి పరిచ్ఛేదము (సెక్షన్) - 06 ననుసరించి]
1) సెక్షన్ (7) లోని సబ్ సెక్షన్ (1) క్రింద సొసైటి రిజిస్ట్రేషన్ కొరకు రిజిస్ట్రార్ వారికి ధరఖాస్తు చేసుకోవలెను. ధరఖాస్తు ఫారం నమూనా, ధరఖాస్తులో పొందుపరచవలసిన అంశములను రిజిస్ట్రార్ ఎప్పటికప్పుడు నిర్దేశిస్తారు.
2) ప్రతి ధరఖాస్తుతోనూ ఈ క్రింది డాక్యుమెంట్లు జతపరచవలెను.
a) (i) ధరఖాస్తుదారులచే ఆమోధించబడిన సొసైటి నిభంధనావళి (బైలాస్) అసలు ప్రతి, నకలు ప్రతి ఒకటి.
(ii) సొసైటి నిభంధనావళి ఆమోధించబడిన సమావేశపు మినిట్స్ యొక్క నకలు.
(iii) సభ్యుల ప్రమాణ పత్రములు (ధరఖాస్తు పత్రముతో పొందుపరచబడిన విషయములు వాస్తవములని, మిగిలిన సభ్యులు, తాను ఒకే కుటుంబమునకు చెందిన వారం కాదని కూడా ప్రతి సభ్యుడు తన ప్రమాణ పత్రములో పేర్కొనవలెను).
b) సభ్యులంతా వ్యక్తులే అయినట్లు అయితే, సొసైటి సభ్యుల సంఖ్య పదికి తగ్గరాదు. సభ్యులంతా విబిన్న కుటుంబములకు చెందినవారై ఉండవలెను. సెక్షన్ 19 లోని సబ్ సెక్షన్(1) లో ఉదహరించబడిన అర్హతలు ప్రతి సభ్యునికి ఉండవలెను.
c) సొసైటి సభ్యులకు ఋణ సౌకర్యము కలిగించు నిమ్మిత్తము వనరులను సమీకరించుట (rising of funds) ఒక సొసైటి లక్ష్యం అయి ఉండి, సొసైటి సభ్యులంతా వ్యక్తులే అయినప్పుడు, ధరఖాస్తుదారులంతా అదే పట్టణము లేక గ్రామము లేక ఒకే ప్రదేశములోని గ్రామములొ నివసిస్తూ ఉండవలెను. లేక అదే ప్రాంతములో స్టిరాస్తులను కలిగి ఉండవలెను. లేక వారంతా ఒకే వర్గమునకు చెందినవారై ఉండవలెను. లేక ఒకే తరహా వృతి చేస్తుండవలెను. అయితే, ఆన్ లిమిటెడ్ లయబిలిటీ గల సొసైటి విషయములో సభ్యులంతా ఒకే పట్టణం లేక గ్రామం లేక ఒకే ప్రాంతంలోని గ్రామాలలో తప్పనిసరిగా నివసిస్తూ ఉండవలెను.
cc) ఒక సొసైటి యొక్క లక్ష్యం తన సభ్యులకు ముడి వస్తువులను అందజేసి, వాటి ద్వారా వారు తయారు చేయు వస్తువులను విక్రయించడం అయి ఉండవచ్చు. అటువంటి సంధర్బములలో ధరఖాస్తుధరులంతా వ్యక్తులే అయినప్పుడు, వారంతా సొసైటి కార్యకలాపములు విస్తరించి యుండు పరిధి లోపలే నివశిస్తూ ఉండవలెను. వారంతా వృత్తిరీత్యా ఒకే వర్గమునకు చెంది ఉండవలెను. అదే సందర్భములో కొన్ని ఇతర తరగతులకు చెందిన సొసైటీల విషయములో కూడా సదరు సొసైటీల ధరఖాస్తు ధారులు కూడా పైన ఉదహరించబడిన విధముగా ఆ సొసైటి కార్యకలాపములు విస్తరించి యుండు పరిది లోపలనే నివశిస్తూ ఉండవలెనని నిర్దేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులు జారీచేయవచ్చును.
d)(i) ధరఖాస్తు దారులంతా వ్యక్తులే అయినట్లైతే, ధరఖాస్తుపై వారంతా సంతకము చేయవలెను (మరియు)
ii) ధరఖాస్తు చేయునది సొసైటి అయినట్లైతే, సదరు సొసైటి యొక్క ఆధీకృత సభ్యుడు ధరఖాస్తుపై సంతకము చేయవలెను.
3) సబ్ సెక్షన్ (2) లోని క్లాజు (సి) లో ఉదహరించబడిన అంశములపై (అనగా నివాసము, ఆస్థిని కలిగియుండుట, గ్రామముల సముదాయము, వర్గము లేక వృత్తి వగైరా) వివాదములు తలెత్తినట్లైతే ఆ అంశములపై రిజిస్ట్రారు నిర్ణయము తీసుకుంటారు. సెక్షన్ 76 లోని నిబంధనలకు లోబడి ఆ అంశముపై రిజిస్ట్రారు నిర్ణయమే అంతిమ నిర్ణయము.
4) ఈ క్రింది అంశములపై రిజిస్ట్రార్ సంతృప్తి చెందినట్లయితే, ధరఖాస్తు చేసుకున్న సొసైటి మరియు నిబంధనావళి (బైలాస్) రిజిస్టర్ అవుతాయి. (నిర్దేశించిన వ్యవధిలోపల), ఆ అంశములు ఏవనగా:
a) దరఖాస్తు ఈ చట్టమునకు, ఈ చట్ట నిబంధనలకు అనుగుణముగా ఉండవలెను.
b)సొసైటి యొక్క లక్షణములు సెక్షన్ (4) లోని అంశములకు అనుగుణముగా ఉండవలెను.
c) సొసైటి ఆర్ధిక పరిపుష్టి కలిగి యుండుటకు అవకాశము ఉండవలెను. రిజిస్టర్ చేసినందువలన సహకార ఉద్యమ అభివృద్ధిపై ఎటువంటి ప్రతికూల ప్రభావము ఉండకుండుట.
d) సొసైటి యొక్క నిబంధనావళి (బైలాస్) ఈ చట్టమునకు, ఈ చట్ట నిబంధనలకు విరుద్దముగా ఉండరాదు (మరియు).
e) సొసైటి యొక్క లక్ష్యముల గురించి [సెక్షన్ (4) లో ఉదహరింపబడిన విదముగా] సొసైటి నిబంధనావళి గురించి ధరఖాస్తుదారులకు పూర్తి అవగాహన ఉండుట.
5) ధరఖాస్తులోని అంశములతో రిజిస్ట్రార్ సంతృప్తి చెందనట్లైతే, సొసైటిని రిజిస్టర్ చేసుకొనేందుకు నిరాకరిస్తూ అందుకు తగిన కారణములను పేర్కొంటూ, ఆ విషయమును నిర్దిష్ట వ్యవధిలోపల ధరఖాస్తుదారునికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా తెలియపరచవలెను.
సొసైటి రిజిస్ట్రేషన్ కోసం సహకార సంఘాల రిజిస్ట్రార్ కు ధరఖాస్తు చేసుకోవాలి. ధరఖాస్తు ఫారం నమూనా రూల్ 3 లో పొందపరచబడినది. (ఫారం - A). సొసైటి రిజిస్టర్ కావాలంటే కనీసం ఆ సొసైటిలో 10 మంది సభ్యులుండాలి. సభ్యులంతా ఆ ధరఖాస్తు ఫారం పై సంతకాలు చేయాలి, ఇది గమనార్హము. అంతేగాకుండా ప్రతి ధరఖాస్తుదారుడూ విడివిడిగా ప్రమాణం కూడా చేయాలి. ఆ ప్రమాణ పత్రం నమూనా కూడా రూల్ 3 లో ఉన్నది.
సొసైటి అంటే కుటుంబ సభ్యుల ఆస్తికాదు. ఎటువంటి రక్త సంబంధములేని పది మంది వ్యక్తులు కలిస్తేనే అది సహకార సంఘము అవుతుంది. అందువలన ఒకే కుటుంబంలోని సభ్యులు, ఆతి దగ్గర రక్త సంబంధీకులైన బంధువులు కలసి సొసైటీని ఏర్పాటు చేయటం కుదరదు. కుటుంబ సభ్యులంటే ఎవరో సబ్ సెక్షన్ (2) లోని వివరణలో పేర్కొనబడింది. అంటే ఒక కుటుంబంలోని వ్యక్తులు కాని వారు ఎవరైనా పదిమంది కలసి ఒక సహకార సంఘాన్ని స్థాపించుకోవచ్చు. ఇవి రెండూ సహకార సంఘ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన రెండు ప్రాధమిక అంశాలు. ఇవి రెండే కాక మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి.
ప్రతి సహకార సంఘానికి కొంత పరిధి ఉంటుంది. ఆ పరిది ఒక గ్రామం కావచ్చు. లేక పట్టణం కావచ్చు. అంటే ఆ పరిధిలోపలనే ఆ సహకార సంఘం తన కార్యకలాపాలను కొనసాగించకోవలసి ఉంటుంధి.
అందువలన ఆ సహకార సంస్థ పరిధిలోనే ఆ సంఘ సభ్యులు నివాసము ఉండాలి. లేక వారి స్థిరాస్తులు ఉండాలి. అయితే, ఈ క్లాజు అన్ని రకాల సొసైటీలకు వర్తించదు. ఆర్ధిక వనరుల సమీకరణ (డిపాజిట్లు సేకరించటం వగైరా) లక్ష్యంగా గల సొసైటీలకే ఈ క్లాజు వర్తిస్తుంది. క్లాజు (సి) ప్రకారం ఆర్దిక వనరుల సమీకరణ లక్ష్యంగా గల సొసైటి వ్యవస్థాపక సభ్యులు ఆ సొసైటీ పరిధిలో నివాసం ఉండాలి. వారు మరొక చోట నివసిస్తునట్లైతే సొసైటి పరిధిలోనే వారికి స్థిరాస్తులు ఉండవలెను. అయితే ఆ సొసైటీ ఆన్ లిమిటెడ్ లయబిలిటీ కలిగి ఉన్నట్లైతే ఈ మినహాయింపు లేదు. అటువంటి సొసైటీల వ్యవస్థాపక సభ్యులు తప్పనిసరిగా ఆ సొసైటీ పరిధిలో నివసిస్తున్న వారై ఉండాలి. ఈ తేడా గమనర్హము.
ఇక వ్యవస్థాపక సభ్యుల అర్హతలకు సంబంధించి మరొక ముఖ్యమైన అంశం సభ్యుల వృత్తి, వర్గానికి సంబంధించినది. ప్రత్యేకించి వస్తువుల ఉత్పత్తి, అమ్మకం లక్ష్యంగా గల సొసైటీలకు ఈ అంశం వర్తిస్తుంది. వర్గం అంటే (క్లాస్) ఒక రకంగా కులం అని అర్దం చెప్పుకోవచ్చు. అయితే అన్ని సందర్భాలకూ ఈ అర్దం వర్తించకపోయినా, చాలా సందర్భాలకు వర్తిస్తుంది. ఉదాహరణకు చేనేత వృత్తిపై ఆధారపడిన వ్యక్తులు దాదాపు అంతా పద్మశాలిలై ఉంటారు. అయితే పద్మసాలీలు కాని వారు కూడా కొందరు చేనేత వృత్తిలో ఉండి ఉండవచ్చు. అందుకే, క్లాజు (cc) లో ‘కులం’ అనే పదం వాడబడలేదు. కేవలం క్లాస్ అనే పదం వాడబడింది. అందువలన క్లాస్ అనే పదాన్ని వృత్తితో కలిపి (class and Profession) అన్వయించుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. ఉదాహరణకు ఒకే ప్రదేశంలో చేనేత వృత్తిలో ఉన్నవారంతా ఒక సొసైటీగా ఏర్పడవచ్చు. వారంతా ఒకే కులస్థులై ఉండనవసరం లేదు. ఒక రకంగా చెప్పాలంటే కులం కన్నా వృత్తి ప్రధాన పాత్ర వహించే అవకాశము ఉంటుంది. అయితే ఒక వృత్తిలో ఉన్న విభిన్న వర్గాలు ఒక సొసైటీగా ఏర్పడవచ్చా లేదా అన్నది ఆ సొసైటీ బైలాస్ పై ఆధారపడి ఉంటుంది.
సొసైటి రిజిస్ట్రేషన్ కొరకు పెట్టుకొన్న ధరఖాస్తు అన్ని విధాల సక్రమమైనదేనని రిజిస్ట్రార్ భావిస్తే ఆ సొసైటి రిజిస్టర్ అవుతుంది. లేనట్లయితే ధరఖాస్తు తిరస్కరించబడుతుంది. అటువంటి సందర్భాలలో తిరస్కరించబడటానికి గల కారణాలను ధరఖాస్తుదారులకు రిజిస్ట్రార్ తెలియపరచాలి. ప్రైమరీ సొసైటీల విషయంలో ధరఖాస్తు చేయబడిన 45 రోజుల లోపల రిజిస్టర్ చేయాలి. లేక రిజిస్ట్రేషన్ తిరస్కరణకు గల కారణాలను తెలియపరచాలి. ఇతర సొసైటీల విషయంలో ఆ వ్యవధి 60 రోజులు. సొసైటి రిజిస్ట్రేషన్ కు సంబంధించిన పూర్తి వివరణ రూల్ 3 లో ఉంటుంది. అందువలన ఈ సెక్షన్ ను రూలు 3 తో కలిపి అన్వయించుకోవాలి.
సెక్షన్ 8: రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్:
ఒక సొసైటి రిజిస్టర్ అయిన వెంటనే రిజిస్ట్రార్ ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ను ఇస్తారు. ఆ సర్టిఫికేట్ పై రిజిస్ట్రార్ సంతకము, అధికారముద్ర ఉంటాయి. ఒక సొసైటీ రిజిస్టర్ అయినట్లుగా బావించటానికి ఆ సర్టిఫికేట్ తిరుగులేని సాక్ష్యం అవుతుంది. (సర్టిఫికేట్ రద్దుయినట్లు దృవీకరించబడే వరకు).
సొసైటీ లను రిజిస్టర్ చేయు విధానము:
(సహకార సంఘముల చట్టము నిబంధన – 3 ప్రకారం)
నిభందన-03:
i) సొసైటీ రిజిస్ట్రేషన్ కొరకు చేయు దరఖాస్తు ఫారం ‘A’ లో చూపబడిన విధముగా ఉండవలెను. ఆ ధరఖాస్తు పై ధరఖాస్తుదారులంతా సంతకము చేయవలెను. ఆ ధరఖాస్తుకు ఈ క్రింది డాక్యుమెంట్లు జతచేయవలెను.
a) సొసైటీ నిబంధనావళి కాపీలు రెండు.
b) సొసైటీ ఏర్పాటుకు నిర్ణయించిన వ్యక్తుల జాబితా. (వారి పేర్లు, తండ్రి లేక సంరక్షకుని పేరు, చిరునామా, వారి వాట పెట్టుబడి, చెల్లించిన సభ్యత్వ రుసుము మొదలైన వివరములు ఆ జాబితాలో ఉదహరించవలెను)
c) ధరఖాస్తుదారుల ప్రమాణ పత్రములు. (ప్రతి సభ్యుడు విడివిడిగా ప్రమాణము చేయవలెను)
d) సొసైటీ ఆర్ధిక స్థిరత్వమునుకు సంబంధించిన వివరములు.
e) సందర్బానుసారంగా రిజిస్ట్రార్ కోరు ఇతర డాక్యుమెంట్లు.
ii) ధరఖాస్తుదారు కనుక రిజిస్టర్ కాబడిన సొసైటీ అయినట్లయితే, ఆ సొసైటీ పాలక మండలి సభ్యుడు లేదా అద్యక్షుడు ఆ ధరఖాస్తుపై సంతకము చేయవలెను. ఆ విధముగా సంతకము చేయుటకు సదరు సొసైటీ పాలక మండలి వారికి అధికార మిస్తూ తీర్మనిoచవలెను. ఆ తీర్మాన ప్రతిని ధరఖాస్తుకు జతచేయవలెను.
iii) ధరఖాస్తును రిజిస్ట్రార్ కు రిజిస్టర్ పోస్ట్ లో పంపవలెను. లేక రిజిస్ట్రార్ కార్యాలయములో దాఖలు చేయవచ్చును .
iv) సొసైటీ రిజిస్ట్రేషన్ నిమిత్తం తనకు అందిన ధరఖాస్తును, నిబంధనావళి రిజిస్ట్రార్ పరిశీలిస్తారు. సొసైటీ లక్ష్య సాధనా సంపత్తి గురించి, భాద్యతల గురించి ధరఖాస్తుదారులతో సంప్రదిస్తారు
v) నిబంధనలలో నిర్దేశించిన విధముగా కనీస సభ్యత్వమును ఆ సొసైటీ కలిగి ఉండవలెను. సభ్యులు కనీస వాటాలను పెట్టుపడిగా పెట్టి ఉండవలెను. (మరియు)
vi) సర్వ సభ్య సభ ఆమోదించిన నిబంధనావళి చట్టమునకు, నిబంధనలకు అనుగుణముగా ఉండవలెను.
vii) అవసరమనిపించినట్లయితే నిబంధనావళిని రిజిస్ట్రార్ సవరించవచ్చు.
viii) అప్పుడు రిజిస్ట్రార్ సదరు సొసైటీ ని నిబంధనావళిని రిజిస్టర్ చేయవలెను.
ix) సబ్ రూలు (viii) క్రింద ఒక సొసైటీ ని రిజిస్టర్ చేసినప్పుడు, అందుకు సంబందించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ను రిజిస్ట్రార్ సదరు సొసైటీకి ఉచితముగా ఇవ్వవలెను. ఆ సర్టిఫికేట్ రిజిస్ట్రార్ సంతకము, అధికారముద్ర కలిగి యుండవలెను. ఆ సర్టిఫికేట్ తో బాటు రిజిస్టర్ బైలాస్ (నిబంధనవళీ) కాపీని కుడా ఇవ్వవలెను. ఆ సొసైటీ కి ఏదయినా ఫైనాన్సింగ్ బ్యాంకు ఉన్నట్లయితే, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మరియు నిబంధనావళీ కాఫీని సదరు ఫైనాన్సింగ్ బ్యాంకుకు కుడా పంపవలెను.
x) దరఖాస్తుతో గాని లేక నిబంధనావళితో గాని రిజిస్ట్రార్ సంతృప్తి చెందనట్లయితే, సదరు సొసైటీ ని రిజిస్టర్ చేయుటకు రిజిస్ట్రార్ తిరస్కరిస్తూ అందుకు గల కారణములను పేర్కొంటూ, ఆ విషయమును దరఖాస్తుదారులకు తిరుగు రశీదు తో కూడిన రిజిస్టర్డ్ పోస్టు ద్వార తెలియపరచవలెను.
xi) a) ప్రాధమిక సొసైటీ ల విషయములో దరఖాస్తు అందిన 45 రోజుల లోపల రిజిస్ట్రార్ ఒక నిర్ణయమునకు రావలసి వుంటుంది. (ఆమోదిస్తూ గాని లేక తిరస్కరిస్తూ గాని)
b) మిగిలిన సొసైటీ ల విషయములో దరఖాస్తు అందిన 60 రోజుల లోపల రిజిస్ట్రార్ ఒక నిర్ణయమునకు రావలసి ఉంటుంది. (ఆమోదిస్తూ గాని లేక తిరస్కరిస్తూ గాని)
బైలా (ఉపనిబంధనావళి) లో పొందుపరచవలసిన అంశములు :
(సహకార సంఘముల చట్టము నిబంధన – 5 ప్రకారం)
సొసైటీ యొక్క నిబంధనావళి ఈ చట్ట నిబంధనలకు విరుద్ధముగా ఉండరాదు. సొసైటీ స్వరూప స్వభావములను బట్టి ఈ క్రింద ఉదహరింపబడిన అంశములు అన్నిగాని లేక కొన్ని గాని నిబంధనావళి లో పొందుపరచబడి ఉండవలెను.
1) సొసైటీ పేరు, చిరునామా
2) కార్యకలాపముల విస్తరించి యుండు పరిధి
3) సొసైటీ లక్ష్యములు
4) సొసైటీ నిధులను ఎందుకొరకు వినియోగించునది
5) సభ్యత్వ రుసుము
6) సొసైటీ చేయు ఋణములకు సంబంధించి సబ్యుల బాద్యత (లిమిటెడ్ లయబిలిటీ లేక అన్ లిమిటెడ్ లయబిలిటీ)
7) సొసైటీ వాటా మూలధనము, దాని స్వభావము, ఒక సభ్యుడు ఎంత గరిష్ట మొత్తమును పెట్టుబడిగా పెట్టవచ్చును. (షేర్ కాపిటల్ అవసరము లేని సొసైటీ లకు ఈ క్లాజు వర్తించదు.)
8) సభ్యత్వ అనర్హత మరియు సభ్యులు మరణించినప్పుడు మూలధనమును పొందుటకుగాను పాటించవలసిన పద్దతి
9) సభ్యత్వములేని వారికి సంఘము నందు కల అధికారములు, బాధ్యతలు మరియు హక్కులు,
10) మూలధన నిల్వ, ఉన్నట్లయితే, ఎంత ఎక్కువగా ఒక సభ్యుడు కలిగి ఉండవచ్చు.
(ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘములు, ఇతర వ్యవసాయ సహకార పరపతి సంఘములలో సభ్యుల కనిష్ట వాటా విలువ పది రూపాయలు.)
11) ఎటువంటి పరిస్థితులలో సొసైటీ డిపాజిట్లను స్వేకరింపవచ్చును. ఎంత మేరకు డిపాజిట్లను స్వీకరించవచ్చును. ఎటువంటి పరిస్థితులలో ఎంత మేరకు ఋణములను స్వీకరించవచ్చును. అందుకు అనుసరించవలసిన విధానము.
12) సభ్యుల నుండి వసూలు చేయవలసిన సబ్యత్వ రుసుము, జరిమానాలు, ఇతర పిజులు.
13) సభ్యులకు అందజేయు గరిష్ట ఋణము, ఋణములు ఇచ్చుటకు అనుసరించవలసిన విధానము, ఋణములు చెల్లింపు, ఫైనాన్సింగ్ బ్యాంకు విధించు నిబంధనలను దృష్టిలో ఉంచుకుని సభ్యుల నుండి ఋణ బకాయిలను వసూలు చేయు విధానము.
14) ఋణము చెల్లింపు కు గల వ్యవధిని పొడిగించుట, ఋణములను రెన్యువల్ చేయుట.
15) ఒక సొసైటీ మరొక సొసైటీ కి గాని, ఉద్యోగులుకు గాని ఋణములను ఇచ్చుటకు సంబంధించిన నిబంధనలు.
16) సభ్యుల సకాలములో చెల్లింపులను చేయక డిఫాల్ట్ అగుట, పర్యవసానము.
17) ఋణగ్రస్తులైన సభ్యులు చేయు చెల్లింపులను జమ చేయు విధానము (method of appropriating payments).
18) వాటా మూలధనము మీద సభ్యులకు చెల్లించవలసిన వడ్డీ, డివిడెంట్.
19) సొసైటీ చేసిన అప్పులపై వడ్డీ చెల్లింపుకు సంబంధిన అంశములు, సభ్యులుకు అందజేసిన ఋణముల పై విధించదగిన వడ్డీకి సంబందించిన అంశమలు.
20) వస్తువులను ఉత్పత్తి మరియు పంపిణీ చేయు సొసైటీలకు సంబంధించి వస్తువుల విక్రయము, స్టాకు నిర్వహణ.
21) రిప్రజంటేటివ్ జనరల్ బాడీ నిర్మాణము, అధికారములు
22) సమావేశముల నిర్వహణ, ఓటింగ్ విధానము, నినంధనవాళీ సవరణ.
23) పాలక మండలి నిర్మాణము, ఇతర అధికారుల నియామకము, తొలగింపు. పాలకమండలి మరియు అధికారుల విధులు, బాధ్యతలు, అధికారములు, పాలకమండలి కాల వ్యవధి, పాలకమండలి సభ్యుల ఎన్నిక విధానము.
24) సొసైటీ అధికారుల, ఉద్యోగుల, ఉద్యోగ నియామక విధానము, ఉద్యోగ నిబంధనలు, వారికి చెల్లించు జీతబత్యముల నిర్ణయము, సమీక్షించు అధికారము, ఉద్యోగులు, అధికారులపై క్రమశిక్షణ చర్యలు, కేసుల విచారణ.
25 ) అకౌంట్ల నిర్వహణ, నిధులను బద్రపరుచుట, నిధులను పెట్టుబడిగా పెట్టు విధానము.
26) డాక్యుమెంట్లపై సంతకము చేయుట గురించి అధికరారి లేక అధికారులకు అధికారమిచ్చుట, సొసైటీ తరపున దావాలను దాఖలు చేయుట, సొసైటీ పై దావా దాఖలు కాబడినప్పుడు సొసైటీ తరుపున వాదన చేయు అధికారులకు అవసరమైన అధికారములను సంక్రమింపజేయుట.
27) సభ్యులకు అందుబాటులో గల సేవలు, ఒక సహకార సంవత్సరములో సభ్యులు వినియోగించు కొనవలసిన కనిష్ట సేవలు
28) రిజిస్ట్రార్ కోరిన విధముగా నివేదికలను తయారుచేయుట, రిజిస్ట్రార్ కు పంపుట, వాటిని పబ్లిక్ చేయుట.
29) ఒక సొసైటీ ని మరొక సొసైటీ కి అనుబంధముగా చేయుట. అందుకు సంబందించిన చార్జీలు చెల్లింపు.
౩౦) ఈ చట్టము క్రింద, నిబంధనల క్రింద, సొసైటీ నిబంధనావళి క్రింద అవసరమైన వివిధ విధులను నిర్వహించుట.
31) పర్యవేక్షణ సంఘము ఏర్పాటు.
32) మైనర్లను సభ్యులుగా చేర్చుకొనుట, మైనర్లకు సంబంధించిన నిబంధనల ననుసరించి వారికి సేవలందించుట, వారి ప్రయోజనముల పరిరక్షణ.
33) సభ్యుల నుండి నిర్భందముగా కొంత మొత్తమును సేకరించుటకు (compulsary thrift) సంబంధించిన అంశములు. ఆ అంశములు ఈ క్రింది విషములకు సంబందినవి అయి ఉండవలెను.
a) రూలు 18(b) నిబంధనానుసారం సభ్యుల నుండి నిర్బంధముగా సేకరించు మొత్తం.
b) ఆ మొత్తమును ఎంత కాలమునకోకసారి వసూలు చేయవలెను
c) ఆ మొత్తము పై సొసైటీ చెల్లించు వడ్డీ.
d) నిర్భంద డిపాజిట్ మొత్తముతో సభ్యుని ఋణ అర్హతకు లింకును ఏర్పరుచుట. నిర్భంద డిపాజిట్ మొత్తమును సభ్యునికి తిరిగి చెల్లించుటకు సంబందించిన నిబంధనలు.
34) సభ్యులు కాని వారితో వ్యాపారము చేయు విధానము- వ్యాపార స్వభావము ఎంత మొత్తమునకు వ్యాపారము చేయవచ్చును మొదలగు అంశములు.
35) సర్వ సబ్య సమావేశములో, ఎన్నికలలో ఓటు వేయుటకు అర్హతగల సభ్యుల జాబితాను తాయారు చేయు విధానము.
ఏ రెండు సొసైటీ ల నిబంధనావళి ఒకే రకముగా ఉండదు. సొసైటీ స్వరూప స్వభావలను బట్టి నిబంధనావళి ఉంటుంది. ఈ రులులో ఉదహరించబడిన 35 క్లాజులు అన్ని సొసైటీ లకు వర్తించదు. సొసైటీ చిరునామా, సర్వసభ్య సమావేశాలు, కోరం, పాలకమండలి సభ్యుల ఎన్నిక, పాలకమండలి సభ్యుల సంఖ్య, వారి అధికారాలు, అనర్హతలు, పదవి నుండి తొలగించుట, బ్యాంకు ఖాతా నిర్వహణ, ఆడిటింగ్ వంటి అంశాలు మాత్రం దాదాపు అన్ని సొసైటీ లకు వర్తిస్తాయి. ఏదయినా అంశం గురించ సొసైటీ నిబంధనావళి లో స్పష్టంగా లేనట్లయితే, ఆ అంశానికి సంబంధించి ఈ చట్టంలోని నిబంధనలు వర్తిస్తాయి. ఈ విషయం గమనార్హము. ఇక్కడ మరొక విషయం కుడా గుర్తించుకోవాలి. అదేమిటంటే సొసైటీ నిబంధనావళి ఈ చట్టానికి అనుగుణంగా ఉండాలి. ఉదాహరణకు సర్వ సభ్య సమావేశం సంవత్సరానికి ఎన్నిసార్లు జరగాలి.
పాలక మండలి సభ్యులను ఏ విధంగా తొలగించవచ్చు అను అంశములను సంబంధించి ఈ చట్టములో స్పష్టముగా సూచించబడింది. సొసైటీ నిబంధనావళి లో అందుకు విరుద్దమైన నిబంధనలు ఉండరాదు.
FORM – A (ఫారము – ఎ)
[రూలు 3 దాఖలా సహకార సంఘముల నమోదు (రిజిస్ట్రేషేన్) కొరకు దరఖాస్తు]
................... రిజిస్ట్రారు గారికి,
ఈ క్రింద సంతకములు చేసిన మేము ......................................................... పేరుతో సహకార సంఘమును, నియమావళి రిజిస్టర్ చేసుకోనదలచి దరఖాస్తు చేసుకోనుచున్నాము. ఈ సహకార సంఘం పరిమిత (లేక) అపరిమిత లయబిలిటీ కలిగి ఉంటుంది. మా సహకార సంఘం కేంద్ర కార్యాలయం చిరునామా ...............................
మా సంతకములతో కూడిన నిబంధనావళి రెండు ప్రతులను, ఈ క్రింద ఉదహరింపబడిన డాక్యుమెంట్లను ఈ దరఖాస్తు జత చేయడమైనది –
1) సహకార సంఘం ఏర్పాటుకు ముందుకు వచ్చిన వ్యక్తుల పేర్లు, చిరునామాలు, వారు చెల్లించిన ప్రవేశరుసుము, షేర్ కాపిటల్ వివిరములు.
2) సహకార సంఘం ఆర్ధిక పరిపుష్టికి సంబందించిన వివరములు.
3) రిజిస్ట్రేషన్ మరియౌ ఇతర సంబందిత విషయముల గురించి ఉత్తర ప్రత్యుత్తరములు జరుపవలసిన వ్యక్తి చిరునామా.
4) దరఖాస్తుల ప్రమాణ వాంగ్మూలములు
ఈ దరఖాస్తులోని విషయములు, ఇందు వెంట దాఖలు చేయబడిన డాకుమెంట్లలోని విషయములు మాకు తెలిసినంత వారికు వాస్తవములేనని ప్రమాణము చేయుచున్నాము.
దరఖాస్తుదారుల సంతకములు
(కనీసం పది మంది దరఖాస్తుదారులు సంతకములు చేయవలెను)
సాక్షులు
1.
2.
షేర్ కాపిటల్ డిపాజిట్ ధృవీకరణ
పైన ఉదహరించిన ................................ పేరుగల సహకార సంఘ సభ్యులు షేర్ కాపిటల్ క్రింద రూ............... మా బ్యాంకులో డిపాజిట్ చేయడమైనది.
బ్యాంకు అధికారి సంతకము.
స్టాంపు ( బ్యాంకు సీలు)
గమనిక: దరఖాస్తులు వ్యక్తులైనట్లయితే వారంతా మేజర్లు, మంచి వ్యక్తత కలవారై ఉండవలెను. విభిన్న కుటుంబములకు చెందినవారై ఉండవలెను. దరఖాస్తు చూసుకున్నది సొసైటీ అయినట్లయితే ఆ సొసైటీ లో సభ్యత్వము కలిగియున్న పది సొసైటీ ల అధికార ప్రతినిధులు సంతకములు చేయవలెను. వారిని తమ ప్రతినిధులుగా ద్రువికరిస్తూ ఆయా సొసైటీ లు చేసిన తీర్మాన ప్రతులను కుడా దరఖాస్తుకు జతచేయాలి.
దరఖాస్తుల ప్రమాణ వాంగ్మూలము
(ప్రతి దరఖాస్తుదారుడు విడివిడిగా ప్రమాణ వాంగ్మూలమును ఇవ్వవలెను)
....................................................................................................... కుమారుడైన (కుమార్తె లేక భర్త లేక బార్య) ....................................................... అనే నేను ఈ క్రింద విధముగా ప్రమాణము చేయుచున్నాను.
నేను ..................... సంవత్సరములుగా ............................... గ్రామములో నివసిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టములోని సెక్షన్ 21 లో ఉదహరించబడిన అనర్హతలు నాకు లేవు. ఆ చట్ట నిబంధనలోని పొందుపరచబడిన అనర్హతలు కుడా నాకు లేవు. సహకార సంఘ చట్టమును, నిబంధనలను, మా సొసైటీ నిబంధనావళిని చదివి అర్ధం చేసుకున్నాను. సొసైటీ సభ్యునిగా నా హక్కులు, బాద్యతలు, విదులును గురించి తెలుసుకున్నాను. సొసైటీ సభ్యుల, సొసైటీ లక్ష్ముల, ప్రయోజనములకు అనుగుణంగా ధులను నిర్వర్తిస్తాను. సహకారోద్యమ అబివృద్దికి కృషి చేస్తాను. సహకార సంఘమునకు, సహకార ఉద్యమానికి నష్టము కలుగజేయు చర్యలకు పాల్పడును.
సాక్షులు :
1.
2.
దరఖాస్తుదారుని సంతకము