Byelaws - Toddy Tappers Cooperative Societies

 Table of Contents(toc)
కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్, నెంబరు ____ నియమావళి

పేరు విలాసము

1 : ........................... కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘము లిమిటెడ్ నెంబరు ....................... 1909/1964 వ సంవత్సరపు ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టము యాక్ట్ VII (As amended) అనుసరించి రిజిస్టర్ చేయబడినది.

ఈ సంఘము యొక్క విలాసము ....................................................................................... గ్రామం ................. పోస్టు .............................తాలుకా .......................... జిల్లా ........................................... మరియు ఈ సంఘము యొక్క కార్య వ్యవహారములు. ....................గ్రామమునకు మరియు ఆ గ్రామ శివారు పల్లెలకు ..............................పరిమితమై వున్నది.

సంఘము యొక్క ఆశయాలు

2 :
(అ)గీత పారిశ్రామికుల విక్రయదారుల ఆర్దిక ప్రయోజనాలను మెరుగుపరుచుట, ప్రభుత్వము నుండి కాంట్రాక్టులు సంపాదించుటద్వారా సంఘ సభ్యులకొరకు లాభదాయకమైన వృతి కనిపెట్టుట.
(ఆ) సంఘ సభ్యుల లాభం కోసం కుటీర పరిశ్రమలు తాటిబెల్లపు పరిశ్రమలో సహా ఇతర అనుబంధ పరిశ్రమలను అభివృద్ది చేయుట.
(ఇ) గీత పరిశ్రమలో మేలైన పద్దతులను, రీతులను ప్రవేశపెట్టి సర్వంగణమగునట్లు చూచుట.
(ఈ) సభ్యులు స్వయం పోశకులగుటకు త్రిఫ్ట్ (THRIFT) పరస్పర సహకార భావంతో వర్తించునట్లు ప్రోత్సహించుట.
(ఉ) సంఘ సభ్యుల ఆర్ధిక ప్రయోజనాల అభివృద్దికి ఉపకరిస్తాయనుకున్న అన్ని కార్యక్రమాల్ని కాలానుగుణంగా పై ఆశయ సాధనకై సాధారణంగా చేపట్టుట.

సభ్యత్వం – వాటాధనం

3 : సంఘ సభ్యులు చెల్లించిన వాటా ధనానికి మూడు రెట్ల వరుకు వారు భాధ్యులగుదురు.
4 : పద్దెనిమిది సంవత్సరముల వయస్సు పైనబడిన గీత పారిశ్రామికులు, కల్లు విక్రయదారులు మరియు యీ వృత్తిలో పనిచేయు తదితరులు ఈ సంఘ కార్యక్షేత్ర పరిధిలో ఉన్న వారందరినీ సభ్యులుగా చేర్చుకునే అధికారము బోర్డు ఆఫ్ డైరెక్టర్ లు కలిగి ఉండగలరు.
నోటు: 4 వ క్లాజు లో గీత పారిశ్రామికుడని వాడిన పదానికి ఈ వృత్తిలో పనిచేయు వారందరికీ వర్తిస్తుంది.

సంఘము యొక్క మూలధనం

5 : ప్రస్తుతానికి రు. ............................... వాటాలుగా మూలధనం సమకూర్చాలి. ప్రతి వాత ధనం విలువ రూ. 10-00 వాటా విలువ ధనం వాటా కేటాయింపు జరగగానే ఏక మొత్తంగా చెల్లించాలి. ప్రతి సభ్యుడు రూ. 2500/- వరకు వాటాలు పొందే అవకాశము కలదు. ప్రతి సభ్యుడు పొందే ప్రతి వాటాకు ఒక రూపాయి చొప్పున ప్రవేశ రుసుము ఇరువది ఐదు రూపాయలకు మించకుండా చెల్లించవలసి ఉంటుంది.

6 : ఏ సభ్యుడు అయిన ప్రవేశ రుసుము వాటా ధనాన్ని పూర్తిగా చెల్లించే వరకూ సభ్యత్వపు హక్కు చలామణి చేయలేడు. ఇందుకోసం నిర్ణీతమైన దరఖాస్తు ఫారం ఏదన్నా ఉంటే దానిపై కేటాయింపు కోరుతున్న వాటాలతో సహా దరఖాస్తును సంఘ కార్యదర్శికి లేదా అధ్యక్షుని కి అందజేయాలి. ఇలాంటి ప్రతి దరఖాస్తును డైరెక్టర్లు బోర్డు వారు పరిష్కరిస్తారు. సభ్యత్వం ఇవ్వడానికి కాని లేదా కారణాలు చూపించి నిరాకరించడానికి కాని డైరెక్టర్లు బోర్డు వారికి అధికారం ఉంటుంది.

7 : సభ్యుడిగా అంగీకరించిన నాటి నుండి రెండు సంవత్సరాల లోపల ఏ సభ్యుడు అయిన తన వాటా ధనాన్ని తిరిగి తీసుకోవడం గాని, సభ్యత్వానికి రాజీనామా ఇవ్వటం గాని, అనుమతించబడదు. రెండు సంవత్సరాల తర్వాత డైరెక్టర్స్ బోర్డు వారి సమ్మతితో వాటా ధనాన్ని తీసుకోవటం గాని, సభ్యత్వానికి రాజీనామా చేయవచ్చును. అయితే (1) అతడు సొసైటీ కి బాకీ ఉండరాదు. (2) అతడు జామీను క్రింద సొసైటీ కి బాకీ ఉండరాదు, రాజీనామా చేయదలచిన సభ్యుడు తన సభ్యత్వపు రాజీనామా Registered పోస్టుద్వారా సొసైటీ అధ్యక్షుని కి రాజీనామా ప్రతి ఒక్కటి, సొసైటీ అనుబంధం చేయబడ్డ కేంద్ర సంస్థ కు పంపించాలి. ఈ రాజీనామా డైరెక్టర్ల బోర్డు అంగీకరించిన నాటి నుండి అమలుకు వస్తుంది. తిరిగి తీసుకోవడానికి అనుమతించబడిన వాటాలు విలువగానీ లేదా సభ్యుని మూలధనపు వాటాను గాని ప్రకటించబడ్డ లాభం (Dividends) ఏదయినా ఉంటే ఆ మొత్తముతో సహా రాజీనామా అంగీకరించిన సభ్యునికి చెల్లించబడుతుంది.

8 : సంఘ సభ్యులుగా చేరనర్హులై డైరెక్టర్స్ బోర్డుచేత అంగీకరించబడిన సభ్యత్వం గల వ్యక్తుల పేరునే వాటాల మార్పిడి జరగగలదు. మార్పిడి జరుగుటకు అంగీకరించబడిన ఒక్కొక్కరి పేరుకు ఒక్కొక్క రూపాయి చొప్పున మార్పిడి రుసుం క్రింద మార్పిడి చేసిన ప్రతిసారీ విధించబడుతుంది. అయితే ఈ మార్పిడి రుసుము మొత్తము తడవకు 25-00 కన్న మించరాదు. 1964 సం.పు ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల 8 (1) రూలు వాటాల ఉపసంహరణలకు వర్తించుతుంది.

9 : సంఘ నియమావళి (By-Law) (1) లో వర్ణించబడిన సంఘ కార్యక్షేతపు పరిధి కి ఆవలికి తన నివాసం మార్చడం వల్లగాని లేదా మరి ఇతర కారణంవల్ల గాని సభ్యుడుగా వుండే వీలు తగ్గిపోయిన సభ్యుని పేరున సభ్యుల వరుస నుండి తొలగించి సొసైటీ కి అతడు చెల్లించిన బాకీని అతని జామీను క్రింద వున్న బాకీని మినహాయించుకొని ప్రకటించిన లాభం (dividend) ఎదైనా ఉంటే చేర్చి అతడు చెల్లించిన వాటా ధనాన్ని ఆరు నెలలలో తిరిగి చెల్లించవలెను.

10 : డైరెక్టర్స్ బోర్డు చేత ఒక సభ్యుడు (ఈ క్రింద కారణాలపై) తొలగించ వచ్చును.
    1. సంఘానికి నిత్యమూ బాకీ యుండుట.
    2. అబద్ధాల మాటలతో సంఘము డైరెక్టర్స్ బోర్డును మోసగించుట.
    3. నేరమారోపించబడి శిక్ష పొందినవాడై ఉండుట. అవినీతి వ్యవహారాలు చేయుచుండుట.
    4. సంఘ ఆశయానికి వ్యతిరేకమైనటువంటి లేదా సంఘ ప్రయోజనాలను బంగపరిచేటటువంటి పనిచేయుట.
    5. సభ్యులు గీచిన కల్లును సంఘం లో అందివకపోవుట.
    6. 1316 వ పస్లి అభ్కారి చట్టానికి అందుకనుగుణమైన రూల్స్ కు బద్దుడై ఉoడకపోవుట.
    7. డైరెక్టర్స్ బోర్డు చేత రుపొందించబడిన వ్యావహారిక నిబంధనలకు బద్ధుడయి ఉండకపోవుట.
    (ఈ కారణాలు పురష్కరించుకొని బోర్డు వారి ఒకని సభ్యతమును రద్దు చేయవచ్చును.)

11 : సంఘం లో ఒక సభ్యునికి గల వాటాలు గోలు పోయే కారణాలు.
1. అబద్ధాల మాటలతో సంఘము డైరెక్టర్స్ బోర్డును మోసగించుట.
2. అబ్కారీ చట్టానికి రూల్స్ కు వ్యతిరేకంగా వ్యవహరించుట.
3. సభ్యుడు గీచిన కల్లును సంఘం లో అందివ్వకుంటే.

12 : సభ్యత్వం కోల్పోవటానికి కారణాలు.
1. మరణంవలన
2. సభ్యత్వానికి ఇచ్చిన రాజీనామా అంగీకరించబడటంవలన.
3. ఒక సభ్యుని వాటాలను సంఘం స్వాధీనపరచుకొను వలన లేదా మార్పిడి చేయుటవలన.
4. ”దివాలా” ప్రకటించబడి నందువలన.
5. (అ కారణముగా ) బోర్డు వారు తొలగించడం వలన అయితే సర్వ సభ్య సమావేశానికి అప్పీలు చేసుకోవచ్చు.

13 :
1. ఒక సభ్యుడు చనిపోయిన వెంటనే (Ipso Facto) అతని సభ్యత్వం అంతం అవుతుంది.
2. తన మరణానంతరము తనకు సొసైటీ లో వున్నా వాటాలకు ప్రయోజనాలకు వారసుడుగా వుండుటకు ఎవర్నయినా సభ్యుడుగా నియమించ వచ్చును. ఈ నామ నిర్దేశం సభ్యుని మరణం తర్వాత డైరెక్టర్స్ బోర్డు చేత అమలుకు తేబడుతుంది అయితే
3. కనీసం సంతకాలు చేసిన ఇద్దరు సాక్షులు ఎదుట నామనిర్దేశ్యము గావించునపుడు సభ్యుడు సంతకం చేయవలసి ఉంటుంది.
4. ఇందుకోసమే ఉంచబడిన సంఘ రిజిస్టర్లో ఈ నామ నిర్దేశము పేర్కొన బడి ఉండవలెను.
5.
[ఎ] నామ నిర్దేశితుడు సంఘ నిబంధనావళి 4, 5 సూత్రములను అనుసరించి సంఘ సభ్యుడుగా డైరెక్టర్స్ బోర్డుచేత అంగీకరించబడాలి.

[బి ] సంఘ నిబంధనల (2) సూత్రన్ననుసరించి మృతుని చేత నామనిర్దేశితుడైన వారెవరులేని సందర్భములో డైరెక్టర్స్ బోర్డుకు మృతుని వారసుడుగా కనిపించిన వ్యక్తికి గాని,

[బి] చట్ట విహితుడగు ప్రతినిధి (Legal Representative) గాని, మృతుని తాలూకు వాటాను లేక లాభము (Interest) ను మార్పు చేయబడును. అయితే ఈ వారసుడు గాని, చట్ట విహితుడైన ప్రతినిధిగాని 4,5 సంఘ నిబంధనల ననుసరించి సంఘ సభ్యుడుగా అంగీకరించబడి యుండవలెను.

[సి] మృతుని చేత నామనిర్దేశితుడైన వ్యక్తికిగాని, ఆట్టి వ్యక్తి లేనప్పుడు మృతుని వారసుడు లేదా చట్ట విహిత ప్రతినిధిగాని మృతుని తాలూకు వాటానుగాని లేక లాభమును చెల్లించమని సంఘాన్ని కోరవచ్చును. అట్ట్లు కోరిన మీదట నామ నిర్దేత్తునుకిగాని, వారసునికిగాని చట్ట విహిత ప్రతినిధిగాని సంఘ నిబంధనల కనుగుణంగా ధృవీకరించబడిన మృతుని తాలూకు వాటాను లేక లాభమును చెల్లించ వచ్చును.

6. ఈ నిబంధన 2 వ క్లాజు ప్రకారం మృతుని చేత నామనిర్దేశితుడైన వానికి గాని వారసుడికి గాని, చట్ట విహితమైన ప్రతినిధికి గాని మృతుని చెల్లించవలసిన ఇతర ద్రవ్యమును సంఘం నుండి చెల్లించ వచ్చును.

14 :
1. ఒక పాత సభ్యుడు నిబంధనావళీ (3) లో సంఘ సభ్యత్వంనుండి తాను తొలగిపోయే రోజున సంఘంలో అతనికి ఎటువంటి కర్తవ్య సంబంధం కలిగి ఉండే వాడో అటువంటి కర్తవ్యం సంబంధం కలవాడై మరో రెండు సంవత్సరాలు వ్యవహరించాలి.
2. నిబంధనావళీ (3) ఏర్పాటు ప్రకారం మృతుని యొక్క ఆస్తిపాస్తులు మరణానికి పిమ్మట రెండు సంవత్సరాల పాటు సంఘంలో అతనికి గల కర్తవ్య సంబంధాలు దృష్ట్యా చనిపోయే రోజు వరకు ఉన్నట్లే బాధ్యతలు (Liable) ఉండగలవు.

15: ఈ సంఘంనుండి కాని మరే సంఘంనుండి కాని తొలగించబడిన సభ్యులు అట్ట్లు తొలగించబడిన తరువాత రెండు సంవత్సరాల కాలం వరకు తిరిగి సభ్యుడుగా చేర్చు కొనబడును. అయితే ప్రత్యేక పరిస్థితులలో సహకార శాఖ రిజిస్ట్రార్ అతనికి పై కాలంలోనే సభ్యత్వాన్ని ఇప్పించబడును.

16: దివాలా కోరునైనానని కోర్టులో దరఖాస్తు పెట్టుకున్నవాడు లేక మోతుబరి (insolvent) కానీ వాడు లేక దివాలా తీసినవాడు మోతుబరి లేనివాడు రాజకీయేతర నేరాల కై శిక్షించబడ్డవాడు, అవినీతిపరుడుగా అపరాధం చేసినవాడు, లేక శిక్ష కొట్టి వేయబడనివాడు, క్షమించబడనివాడు, సంఘ సభ్యుడుగా చేర్చు కొనబడుటకు అనర్హుడు, అయితే శిక్ష ఆఖరైన రోజునుండి 5 సంవత్సరాలు గడచినట్లైతే ఈ అనర్హత చెల్లదు.

విధులు

17 : ఈ క్రింద మార్గములనుండి సాధారణంగా సంఘం నిధులను సేకరిస్తుంది.
    1. వాటా ధనము ప్రవేశ రుసుము ద్వారా
    2. ధరావతుల ద్వారా
    3. సహకార సంఘమునుండి లేక ప్రభుత్వమునుండి అప్పుల ద్వారా
    4. సంఘ శ్రేయస్సు పట్ల అభిరుచి కల ఏజన్సీల లేక ఇతర అధికారుల లేక ప్రభుత్వ సబ్సిడీల ద్వారా
    5. వివిధ ఆదాయాలద్వారా
    [ఎ] డైరెక్టర్లు బోర్డు వారు సమయానుకూలంగా సంఘ వ్యవహార నిర్వహణ కానవసరమైనట్టులైతే ప్రభుత్వంనుండి గాని, సహకారా సంస్థల నుండి గాని, తదితరులనుండిగాని, అప్పు తీసుకొను ఏర్పాట్లు చేయవచ్చును.
     [బి] అవసరమైన డబ్బు సేకరించడం కుదరనప్పుడు పూచీదారులు సంపాదించుటకు డైరెక్టర్ల బోర్డు అధికారం కలిగి ఉంటుంది. అయితే ఈ పూచీదారుడు సంబంధించిన అధికారుల దృష్టిలో సంఘ వ్యవహారాలను చక్కగా నిర్వహించేవాడిని అంగీకృతుడై యుండాలి. సంఘం తీసుకొన్న అబ్కారీ కాంట్రాక్టు వ్యవహారాలలో ఆర్దిక తదితర సంబంధాలను నిర్వహించగలవాడై యుండాలి. ఇటువంటి పూచీదారుకి ప్రతిఫలంగా తగిన రీతి మొత్తాన్ని లేదా పరస్పర ఒడంబడిక మొత్తాన్ని చెల్లించుటకు డైరెక్టర్ల బోర్డుకు ఆధికారముండును.

18 : Missing Serial number.

తీసుకునే అప్పులకు గరిష్ట పరిమితులు

19 : సభ్యుల నుండి గాని, తది తరులనుండి గాని, ధరావతుగానే, ఇతర పద్దతిపై గాని, తీసుకునే అప్పుల పరిమితి సంఘ క్షేమనిధి వాటాల ధనముల మొత్తానికి 6 రెట్ల కన్నా మించరాదు.

ధరావతులు

20: డైరెక్టర్ల బోర్డు వారి విచక్షణను అనుసరించి సభ్యులనుండి గాని, సభ్యే తరుల నుండి గాని ఎప్పుడైనా ధరావతులు తీసుకొన వచ్చును.  ఈ ధరావతులు రెండు తరగతులు - [ఎ] పొదుపు ధరావతులు [బి] నిర్ణీత ధరావతులు

[ఎ] పొదుపు ధరావతులు:
ప్రతి గీత పారిశ్రామికుడు లేక విక్రయదారుడు సంఘములో సభ్యుడుగా ఉన్నంత కాలము సంఘంద్వారా సంపాదించుకున్న ప్రతి రూపాయికి ఒక ఆరు పైసలు వంతున చెల్లించాలి. ఇట్లా జమ చేయబడిన సభ్యుని డబ్బు 10 రూపాయలు కాగానే అతని వాటా ధనపు ఖాతాకు చేర్చబడును.

[బి] నిర్ణీత ధరావతులు:
1. నిర్ణీత ధరావతులనగా ఒక నిర్ణీతమైన గడువునకు ధరావతుగా నుంచుట. 5 రూ!!ల కు తక్కువ మొత్తంగానివి. అలాంటివే వివిధ మొత్తాలుగానివి. ఆరు నెలలకన్న తక్కువ కాలానికి నిర్ణీత ధరావతుగా తీసుకొనబడవు.

2. నిర్ణీత ధరావతుపై వడ్డీ సాలుకు 41/2% శాతముకన్న ఎక్కువ జమ వేయబడును. సభ్యుని చేతకాని, సహకార సంస్థ చేతకాని రూ.100 కు తక్కువ గాని మొత్తము నిర్ణీత ధరావతుగా ఒక సంవత్సరం పాటు చెల్లింపు జరిగినప్పుడు ఆ మొత్తంపై సాలుకు 61/2% మించకుండా వడ్డీ చెల్లించ వచ్చును. నిర్ణీత ధరావతుపై వడ్డీ చెల్లింపు సంవత్సరానికి ఒక మారు జరుగును. లేదా ధరావతు చేసే సమయంలో ఒడంబడిక చేసుకున్నట్లు ధూపాలవారీగా జరుగును.

3. గడువు తీరక పూర్వము మరో ఆరునెలలపాటు కు ధరావతు గడువు పెంచుటకు అభ్యర్ధన సంఘ కార్యాలయమునకు చేరని పక్షములో నిర్ణీత ధరావతులపై వడ్డీ నిర్ణీత కాల పరిసమాప్తి కాగానే అంతమై పోతుంది. గడువు తీరిన నిర్ణీత ధరావతులను పునరుద్దరించే బాధ్యత సంఘానికి లేదు. పునరుద్దరించనున్న అభ్యర్థనను త్రోసిపుచ్చేవరుకు, అంతవరకివ్వవలసిన వడ్డీయే చెల్లించవలయును.

మహాసభ

21 : సభ్యుల సాధారణ సభకే సంఘ పరిపాలనకు సంబంధించిన వ్యవహారములపై అంతిమ నిర్ణయదికారము గలదు. ఈ సభ అప్పుడప్పుడు గాని కనీసము సంవత్సరమున కొకసారిగాని సమావేశమై సంఘ పనులు చక్కబెట్టుతుంది. అయితే డైరెక్టర్ల బోర్డు సంఘ నిబంధనావళి ప్రకారం లభ్యమైన అధికారం ననుసరించి జరుపుతున్న వ్యవహారాలలో సాధారణ జోక్యం కలిగించుకోరాదు.

22 : సర్వ సభ్య మహాసభ సమావేశాలు రెండు విధాలు 

(ఎ) సంవత్సరానికొకసారి మాములుగా జరిగే సాధారణ సభ. 

(బి)అసాధారణ సభ. ప్రతి సంవత్సరం జూన్ నెల ఆఖరి రోజు తర్వాత మూడో నెలలలో వార్షిక సాధారణ సభ సమావేశాలు జరుగుతాయి.
ఈ క్రింద వివరించిన పరిస్థితులు అనుసరించి ఒక నెల లోపు గాని, అంత కన్న ముందు గానీ డైరెక్టర్ల బోర్డు వారిచే అసాధారణ సభలు పిలువబడతాయి.
1. డైరెక్టర్ల బోర్డులోని అధిక సంఖ్య సభ్యులు కోరినప్పుడు
2. సమావేశ ఉద్దేశాన్ని తెలుపుతూ ఆనాడు వున్నా సంఘ సభ్యులు సంఖ్యలో 4 వ వంతు మంది లిఖితపూర్వకముగా సంఘ కార్యదర్శిని లేదా అద్యక్షుడిని కోరినప్పుడు
3. సహకార సంఘాల రిజిస్టరు లేక అతని చేత నియామకమైన అధికారి సూచన ననుసరించి అసాధారణ సభ జరుగుతుంది

23 :
(ఎ) వార్షిక సర్వ సభ్య మహాసభల నోటీసు వాటాదారుల కందరికి పది రోజుల ముందు అందజేయాలి. అసాధారణ సభ నోటీసు వాటాదారుల కందరికి 7 రోజుల ముందు అందజేయాలి. ఆ నోటీసు లో సమావేశ స్థలము, తేది, సమయము, చర్చనీయాంశములు, విస్పష్టముగా తెలపాలి.
నోటీసులు ఈ క్రింద పద్దతుల ద్వార సభ్యులకూ అందజేయవచ్చనును.
1. సంఘ కార్యక్షేత్ర పరిధిలో దండోరా వేయుట ద్వార
2. నోటీసు బుక్కు ద్వారా సమాచారమందించి సంతకాలు తీసుకొనుట.
3. పోస్టల్ సర్టిఫికేట్ పద్దతిపై మాములుగా పోస్టులో నోటీసులు పంపుట.

(బి) నోటీసు తేది, సమావేశపు తేదీలను మినహాయించి నోటీసు గడువు లెక్కించబడుతుంది.

సాధారణ సభకు కోరం [హాజరు కావలసిన కనీసపు సంఖ్య]

24 : సంఘంలోని సభ్యుల మొత్తం సంఖ్యలో 4 వ వంతు గాని లేక 25 మంది గాని ( ఏ సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు ఆ సంఖ్య ) [కోరం] సర్వ సభ్య కార్యకలాపాల నిర్వహణకు హాజరై ఉండుట అవసరం.

(ఎ) సభ్యుల కోరికపై పిలువబడిన అసాధారణ మహాసభలో నిర్ణయించబడిన సమయము తర్వాత అరగంట లో కోరం పూర్తి కాకపోతే సమావేశం రద్దు అయిపోతుంది, సాధారణ సందర్భాలలో అయితే మరుసటి వారం అదే రోజు, అదే స్థలం, అదే సమయమునకు సభ వాయిదా పడుతుంది. ఇట్లు వాయిదాపడిన సమావేశాలలో కోరం పాటించబడదు. నోటీసులలో పేర్కొనబడిన చర్చనీయాంశాలను గూర్చి మాత్రమే ఆనాడు చర్చ జరుగుతుంది.

(బి) సర్వ సభ్య మహా సభ జరుగుతుండగా కోరం కన్న తక్కువ సభ్యులు ఉన్నట్లయితే మిగిలిన కార్య క్రమాలు మాత్రమే నిర్వర్తించుటకు కొనసాగించబడును.

25 : ప్రతి సభ్యుడు అన్ని మహా సభ సమావేశాల్లోను జరిగే చర్చలోనూ పాల్గొనడానికి అర్హుడు. ఎన్ని వాటాలున్న సభ్యునికైనా ఒకే ఓటు ఉంటుంది. తనకు సంబదించిన అంశంపై జరుగుతున్న చర్చలో ఆ సభ్యుడు పాల్గొనరాదు. ఓటు వేయరాదు. ఒక సమస్యపై ఓట్లు [రెండు వైపులా] సమానమైనప్పుడు సభాధ్యక్షుడు తన స్వంత ఓటుకాక అదనపు (Casting) ఓటు కలిగి వుంటాడు. అన్ని సంగతులు అధిక సంఖ్యా కుల అభిమతానికనుగుణంగా నిర్ణయించబడతాయి. ఆక్టులో, రూల్స్ లో, బై-లాస్ లో మరో విధంగా పేర్కొనబడితే తప్ప, “చేతులు ఎత్తు" పద్ధతిన వోటింగు జరుగుతుంది. సభలో ఉన్న వారిలో అధిక సంఖ్యా కులు కోరినట్లయితే బెలేటు పద్దతి అనుసరిoచవచ్చును.

26 : సాధారణంగా ఉండే అధికారాలే గాక, సర్వ సభ్య మహా సభకు ఈ క్రింది అదనపు అధికారాలు విధులు ఉంటాయి.
1. డైరెక్టర్స్ బోర్డును ఎన్నుకొనుట, తొలగించుట,
2. సంఘం లెక్కలనూ, బాలన్స్ షీటును లాభ నష్టాల లెక్కలను పర్యాలోకించటం, ద్రవీకరించటం మరియు లాభాల పంపిణిలాజు ప్రకటించడం.
3. సంఘ ఆదాయ వ్యయపు అంచనాలను (Budget) డైరెక్టర్ ల బోర్డు సిద్ద పరిచి అందజేస్తే పర్యలోకించుట, ద్రవీకరించుట అయితే ఉచితమని తలచిన మార్పులు చేయవచ్చును.
4. అమలులో నిబంధనావళి నుండి ఏ సూత్రాన్నయినా సవరించటం సూత్రాన్నే ఉపసంహరించటం. క్రొత్త వానిని చేర్చటం అయితే ఇదే రిజిస్ట్రారు చేత రిజిస్ట్రేషన్ జరిగిన పిమ్మటే ఆచరణలోనికి వచ్చును.
5. ఏ సభ్యుడైన మరో సభ్యునికి, వ్యతిరేకంగా గాని, డైరెక్టర్లు బోర్డుపై గాని తెచ్చిన ఆరోపణలు పరిశీలించుట.
6. సభాధ్యక్షుని అనుమతి తో ప్రవేశ పెట్టిన మరే ఇతర అంశమును గూర్చి పర్యాలోకించుట.

కార్య నిర్వహణ

27 : సంఘము యొక్క కార్య నిర్వహణ 5 మంది బోర్డు అఫ్ డైరెక్టర్ ల పై ఉంటుంది.

కార్యవర్గ సభ్యులు

కార్యవర్గ సభ్యులు తమలో నుండి ఒకరిని అధ్యక్షుని గాను, మరొకరిని కార్యదర్శిని గాను ఎన్నుకోవలెను.

28 : ఈ క్రింద నియమాలు పాటించడానికి ప్రత్యేకంగానూ అబ్కారీ చట్టపు నియమ నిబంధనలను పూర్తిగా అనుసరించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసే బాధ్యత డైరెక్టర్ ల బోర్డుపై నుండగలదు.

(ఎ) ఆరు నెలల శిస్తు మొత్తమునకు సమానమైన మోతుబరి సదాఖత్ నామ (Solvancy certificate) దాఖలు చేయుటకు లేక అందుకు ప్రత్యామ్నాయముగా రెండు నెలల శిస్తుకు సమానమైన మొత్తమును ధరావతు చేయుటకు లేక అందుకు ప్రత్యామ్నాయముగా, ధరావతు మరియు అదనముగా

(బి) రెండు నెలల శిస్తు మొత్తమును అడ్వాన్సుగా ధరావతు చేయుటకు మరియు

(సి) సాలుసరి శిస్తును “అర్నేస్టుమనీ” గా చెల్లించుట లేక సమయానుసారంగా ప్రభుత్వం ఆదేశించిన నియమానుసరణకు ఆర్ధిక సంబందమయిన ఏ ఇతర వ్యవతనైనను పాటించుట.

డైరెక్టర్స్ బోర్డుకు సభ్యత్వ అర్హతలు:

29 : ఈ క్రింద వివరించబడిన అంశములకు సంబంధించినవారికి డైరెక్టర్స్ బోర్డు కు సభ్యుడుగా ఎన్ని కయ్యే అర్హత ఉండదు.
(ఎ) తొలగించబడినట్టి, ఈ సంఘానికి మరే సహకార సంఘానికి మరే సహకార సంస్థకు గాని, నిబంధనావళి లో పేర్కొనబడిన విధానము ప్రకారము కొoతకాలము బాకీదారుడుగా పరిగణించబడిన వ్యక్తి (ఎన్నికయ్యే అవకాశముండదు)

30 :
(ఎ) ప్రభుత్వము వారిచే (Nomination) చేయబడవలసిన సభ్యుల మినహా, మిగతా పాలక వర్గ సభ్యుల ఎన్నిక ఎప్పటికప్పుడు సవరణ చేయబడిన ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల నిబంధనల ననుసరించి జరుపబడును.

(బి) [డైరెక్టర్స్ బోర్డు సభ్యత్వమునకు] దరఖాస్తు ధారుణి గూర్చి న్యాయ విచారణ జరుగుతున్న లేక దివాలకోరుగా కోర్టు చేత నిర్ణయింపబడినట్టి వ్యక్తి మోతుబరి కానటువంటి ఆన్ సర్టిఫైడ్ దివాలా కోరు విడుధలకానందున మోతుబరి లేనటువంటి వ్యక్తి లేక పిచ్చివాడు. కాబోయే పిచ్చివాడు (ఎన్ని కయ్యే అవకాశము ఉండదు)

(సి) రాజకీయేతరమైన నేరస్తుడుగా శిక్షింపబడియున్నట్టి లేక శిక్షింపబడినట్టి, లేక అవినీతి ప్రవర్తనలో తగుల్కొన్నట్టి వ్యక్తి విధించబడిన శిక్ష రద్దుకావించబడుటయో లేక క్షమింపబడుటయో జరగని వ్యక్తి (ఎన్నికకు అవకాశముండదు)

(డి) సంఘం లో వేతనము పొందుతునట్టి లేక పొందబోవు ఉద్యోగి అలాగే మరే ఆర్ధిక సంస్థ లోనో ఇతర సహకార సంస్థలోనో వేతనము పొందిన పొందుతున్న ఉద్యోగి (ఎన్నికకు వీలు లేదు)

(ఇ) ఇప్పుడే గాని యింతకు క్రితమే కాని ప్రభుత్వానికి అబ్కారీ బకాయి వున్నా తను తీసుకున్న ఏదయినా రుణముల సంబంధము బకాయి వున్నా యెడల, ఎన్నికకు వీలు లేదు.

31 : ఎన్నికయిన డైరెక్టర్స్ బోర్డు కాలపరిమితి మూడు సంవత్సరాల లేదా సహకార సంఘాల రిజిస్ట్రార్ అనుమతి తో మరొక బోర్డు ఏర్పడే వరుకు ఉంటుంది. కాలపరిమితి తీరిన సభ్యులు 1964 వ సంవత్సరపు ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టం లోనే రూలు 22 ననుసరించి మళ్లి ఎన్నిక కావచ్చు ను. ఏ సభ్యుడైనా వరసగా రెండుసార్లు కన్న బోర్డు సభ్యుడుగా ఎన్ని కయ్యే వీలుండదు.
ఇంకా గడువు ఉండగానే ఏదయినా స్థానం ఖాళీ ఏర్పడితే మిగిలిన గడువు పూర్తయ్యేదాక డైరెక్టర్స్ బోర్డు వారు కోఅప్టుద్వార భర్తీ చేయుదురు.

32 : ఏ పరిస్థితిలోనైనా నెలకొకసారి తప్పకుండాను సంఘ వ్యవహారాలు నిర్వహణలో అవసరమైనప్పుడల్లా డైరెక్టర్స్ బోర్డు సమావేశము జరగగలదు. మాములుగా సమావేశపు రోజుకు మూడు రోజుల ముందు డైరెక్టర్స్ బోర్డు సభ్యులకు నోటీసు అందజేయవలెను. సమావేశపు రోజు గణన లో నోటీసు తేది లెక్కించబడుతుంది. డైరెక్టర్స్ బోర్డు సమావేశానికి ముగ్గురు సభ్యులు కోరం అవుతారు. ప్రతి సభ్యునికి ఒక ఓటు ఉంటుంది. అధిక సంఖ్యా కుల ఓట్లతో ప్రతి అంశము నిర్ణయించబడుతుంది. సమానమైన ఓట్లు వచ్చినప్పుడు సమావేశద్యక్షునికి మాములుగా అతనికి ఉండే ఓటుగాక అదనపు ఓటు ఉంటుంది. ప్రాక్సీలపై ఓటు పనికిరాదు. (వ్రాసి పంపే ఓటు చెల్లదు)

డైరెక్టర్స్ బోర్డు వారి బాధ్యతలు – అధికారాలు

33 : డైరెక్టర్స్ బోర్డు కు సాధారణంగా ఉండాల్సిన అధికారాలే కాక ఈ క్రింద వివరించిన అదనపు అధికారాలు ఉంటాయి.
1. ధరావతులు తీసుకొనుట తిరిగి చెల్లించుట మరియు ఇటువంటి ధరావతుపై వడ్డీ నిర్ణయించుట.
2. క్రొత్తగా సభ్యులను చేర్చుకొనుట
3. వచ్చే సంవత్సరం కొరకు ఆదాయవ్యయాల అంచనాలను సాలుకొకసారి తయారుచేసి చర్చ కొరకు అనుమతి కొరకు సాధారణ సభ ముందుoచుట.
4. సాధారణ సభను పిలుచుట
5. సంఘం పనులు నిర్వర్తించడంలోను వ్యవహార నిర్వహణలోను అప్పటికప్పుడు అయ్యే ఖర్చులన్నీ బడ్జెట్ పరిధిని దాటకుండా మంజూరు చేయుట.
6. సాధారణ సభ్యునకు గాని, రిజిష్టర్ కు గాని అందుకు సంబంధించిన ఇతరులకు గాని, కంప్లైంటు చేయుట సంఘ వ్యవహార నిర్వహణలో ఏర్పడే దుస్సాధనమైన కొన్ని అంశములను దృష్టికి కొనివచ్చుట.
7. సంఘం తరపున ప్రభుత్వంవారి వద్దనుండి తీసుకున్న అభ్కారి కాంట్రాక్టును స్వయంగా గీయు సంఘ సభ్యులకు సబ్ లీజు చేయుట, మరియు సంఘ సభ్యులు చెట్లు గీయుటకు కళ్ళు విక్రయించడము, తత్సంబంధమైన ఇతర పనులు సక్రమంగా నిర్వహించే ఏర్పాటు చేయుట .
8. సాధారణ సభ నిర్దేశించునట్లు గాని, సంఘము యొక్క సంఘ సభ్యుల యొక్కా ప్రయోజనాల దృష్ట్యా అవసరమైనా అన్ని చర్యలు గైకొనుట.
9. ప్రత్యేక ప్రయోజనాలకొరకు గాని, రోజు వారి కార్యక్రమ నిర్వహణకు గాని ఉపకమిటి లేక కమిటీలను వేయుట. ఒక వ్యక్తి ని లేక వ్యక్తులను నియోగించుట మరియు తగినవనుకున్న అధికారాలను అప్పగించుట.
10. అందుకొరకు అదికరమివ్వబడిన వ్యక్తి లేక వ్యక్తుల ద్వారా సంఘ ఆస్థిపస్తుల సంరక్షణ ఏర్పాట్లు చేయుట.
11. రిజిస్ట్రార్ వలన ముందు అనుమతి తో సెక్యూరిటీ లను నిర్ణయించుట, పొందుట, నిబంధనల రూపొందించి క్రమబద్దం చేయుట కార్యాలయోద్యోగి బృందాన్ని నియమించుట, తొలగించుట.
12. కోర్టు వ్యవహారాలు నడుపుట సంరక్షించుకొనుట రాజీపడుట
13. పరసిరామిక శాకాహార సంఘలలోను, సహకార బ్యాంకులలోను వాటాలు పొందుట.
14. కోసతిపతి తన స్వాధీనంలో నిలువ వుంచుకోతగిన డబ్బు మొత్తమ్ము యొక్క గరిష్ట పరిమితిని నిర్దేశించుట
15. కాంట్రాక్టు వ్యాపారపు నియమాలు, షరతులు, విధులు రూపొందించుట, మరియౌ సవరణలు చేయుట, రద్దుపరచుట అయితే ఇలాంటివి సాధారణ సభచేత మరియు సహకార సంఘాల రిజిస్ట్రార్ చే ద్రువీ కరించబడవలసి యుండును. 
16. సంఘం చేత లేక సంఘం తరుపున అన్ని పత్రాలపై సంతకం చేయుట.
17. సహకార సంఘాల రిజిస్ట్రార్ అనుమతితో బ్యాంకులలో ఖాతాలు తెరుచుట.

34 : అధ్యక్షుడు లేక కార్యదర్శి లేక డైరెక్టర్స్ బోర్డు వారి చేత అధికారమివ్వబడిన వ్యక్తి సంఘము తీసుకోని స్వీకరించు డబ్బులకు రశీదులు ఇవ్వవలెను.

35 : సంఘ వ్యవహారాల నిర్వహణలో డైరెక్టర్స్ బోర్డువారు విజ్ఞతను ప్రదర్శింపవలెను. యాక్టు నిబంధనలకు, ఉప నియమావళికి వ్యతిరకంగా ప్రవర్తించరాదు.

అధ్యక్షులు – కార్యదర్శి

36 : సంఘం అన్ని వ్యవహారాలు అధ్యక్షుని సాధారణ అదుపులో యుండును, మరియౌ సంఘం యొక్క సమస్త ఆస్తికి అతడు. సంరక్షకుడు డైరెక్టర్ బోర్డు సమావేశాలుకు సాధారణసభ సమావేశాలకు అతడు అద్యక్షత వహించును. అద్యక్షుడు హాజరు కానప్పుడు ఆ స్థానాన్ని కార్యదర్శి తీసుకోని అద్యక్షదికారాల్ని నిర్వహించును, ఏ సమస్య మీద నైనా స్తంభన (tie), వస్తే అధ్యక్షుని కి లేక సభాధ్యక్షుడికి కాస్టింగ్ ఓటు ఉంటుంది.

37 : ఈ క్రింద వివరించిన బాధ్యతలను అధ్యక్షుడు నిర్వర్తించాలి.
1) డైరెక్టర్స్ బోర్డు సాధారణ సభల ఆని సమావేశాలను పిలుచుట, హాజరుగా ఉండుట.
2) సంఘ సభ్యులనుండి సంఘం తరపున శిస్తులు, ధరావతులు వగైరాలు తీసుకొనుట, మరియౌ ప్రభుత్వము వారికి నిబంధన 28 లో పొందుపరచిన నియమాల ప్రకారం లేక అభ్కారి చట్టపు నియమ నిభంధనల ప్రకారము చెల్లించుట. సంఘము తరుపున తదితర డబ్బు తీసుకొనుట, విడుదల చేయుట.
3) సహకార శాఖ ఆదేశాల్ని పాటించుట, ద్రువికరించడానికై సాధారణ సభ ముందుంచట
4) సంఘం యొక్క లెక్కలను ఎప్పటికప్పటికి వ్రాయబడి సక్రమంగా నుంచుట లేక ఉంచు ఏర్పాటుచేయుట.
5) సంఘం తరపున ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుట.
6) డైరెక్టర్స్ బోర్డు చేత రూపొందించబడిన అనుబంధ నియమావళి ప్రకారం సంఘ కర్యలయోద్యుగులపై అదుపు, అజమాయిషీ చేయుట.
7) డైరెక్టర్స్ బోర్డు అనుమతితో సంఘ ఆశయ ఉద్దేశాలు నెరవేర్చటంకొరకు ఇతర కార్యక్రమాల 

కల్లు కాంట్రాక్టు

38 :
1) సంఘం తరపున ప్రభుత్వంతో అభ్కారి కాంట్రాక్టులు తీసుకొనేందుకు డైరెక్టర్స్ బోర్డుకు అధికారం ఉంటుంది. కల్లుగీచి విక్రయించే సంఘ సభ్యులకు అట్టి కాంట్రాక్టును సబ్ లీజు యిచ్చుటకు సంఘం ఏర్పాటు చేస్తుంది, ఆయా సభ్యులతో అనుబంధ నియమావళిలో నిర్దేశించిన షరతుల ప్రకారం సబ్ రీజు నడిచే ఏర్పాటు చేస్తుంది సంఘం.

2) సంఘం పనులు నిర్వర్తించటంలోను వ్యవహార నిర్వహణలోను అప్పటికప్పుడు అయ్యే ఖర్చుల నిమిత్తం, సంఘం యొక్క ప్రతి సభ్యునినుండి నెల వారి చెల్లించే కిస్తులపై, నూటికి రెండు రూపాయలు వసూలు చేస్తుంది.

3) సంఘ సభ్యుల కల్లు గీయుటయు, కల్లు విక్రయించటము మొదలైన వ్యాపారం జయప్రదం అయ్యే కార్యక్రమాల కొరకు 1316 ఫస్లీ అభ్కారి చట్టమునకు అనుగుణ్యమైన అవసరంగా భావించిన అనుబంధ నియమాలను, రిజిస్ట్రార్ అనుమతితో డైరెక్టర్ల బోర్డు వారు రూపొందిస్తారు.

లాభాలు

39 :
1) ప్రతి సంవత్సరానికి రిజిస్ట్రార్ చేత ప్రకటించబడిన నికర లాభంలో 25 శాతము క్షేమనిధిగా వేరు పరుస్తారు.

2) ఆడిట్ చేసినందుకు ప్రభుత్వానికి యిచ్చేందుకు నికర లాభంలో 10 శాతం వేరుపరుస్తారు.

3) ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల రూల్స్ 1964 నిర్ణయించిన కొంత మొత్తాన్ని నికర లాభంనుండి వేరుచేసి విద్యార్ధి నిధిలో చేరుస్తారు.

4) 1890 (ఇండియా) చట్టం రెండవ సెక్షన్ విశదీకరించిన ప్రయోజనం కోసం వినియోగించుటకు సాము దాయక ప్రయోజన నిధి (Common good fund) కీ గాని, లేక గీత పారిశ్రామికుల పిల్లల విద్యాసౌకర్యము కొరకు స్కాలర్ షిప్పులు, పుస్తకములు, హాస్టల్, ఫీజు వగైరా ఇవ్వడం కొరకు నికర లాభము నుండి 10 శాతము కేటాయిస్తారు.

5) చెల్లించిన వాటాధనంపై 6 ¼ శాతమునకు మించని రేటు ప్రకారం వచ్చిన, లాభం నుండి వాటాదారులకు లాభం (Dividends) చెల్లించ వచ్చును.

6) సంఘం వ్యవహార నిర్వహణలో గీత పని తదితర పనులు చేసే వాళ్లకు, వాళ్ళ కిచ్చే జీతాల హెచ్చుతగ్గుల ననుసరించి రేబెట్లుగా పంపకం చేసేందుకు నికర లాభంనుండి కొంత మొత్తమునకు వేరు పరుచ వచ్చును.

7) నిఖర లాభంలో ఇంకా మిగిలిన మొత్తాన్ని సంఘం యొక్క ఇతర (వసూలు కాజాలని భాకీలు, భవననిది, డివిడెండ్ ల సమాన నిధి, సీకింగ్ ఫండ్ డిప్రిషియోషన్ ఫండ్ వగైరా) నిధులకొరకు కేటాయించబడును.

40 : అనుకోకుండా సంఘానికి వచ్చే నష్టాలను ఎదుర్కొనడానికి క్షేమనిధి సంఘానికి ఏర్పడింది. ఇది అవిబాజ్యము. ఏ సభ్యునికీ దీనిలో భాగం కోరే వీల్లేదు. రిజిస్ట్రార్ యొక్క ప్రత్యేకానుమతి తో అనుకోనని నష్టాన్ని ఎదుర్కొనేందుకు వాడుకోవచ్చును. సంఘం ఎత్తి వేసినప్పటి నిధి 1964 ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల నిబంధనలో వర్ణించబడిన రీతిన పరిష్కృతం అవుతుంది.

41 : సంఘ ఉప నియమావళి అంశాల నిర్వచనంలో వచ్చే అన్ని పేచీలను సహకార సంఘాల రిజిస్ట్రార్ తీరుస్తారు. సభ్యుల మధ్య బోర్డు డైరెక్టర్ ల మధ్య లేక ఇతరులతోను సంఘ వ్యవహార నిర్వహణ సందర్భంలో వచ్చెడి అన్ని పేచీలు 1964 సం. పు సహకార సంఘాల రూల్స్ ను అనుసరించి అర్బిట్రేషన్ ద్వారా పరిష్కరించబడును.

42 : అందుకొరకే ప్రత్యేకంగా సమావేశపరచబడిన సాధారణ సభలో హాజరైన సభ్యులలో కనీసం మూడింతలు రెండు వంతుల మంది ఓట్ల ద్వార ఆమోదిస్తే తప్ప ఈ ఉప-నియమావళికి చేర్పులు మార్పులు చేయరాదు. ఇటువంటి సమావేశాలకు మొత్తం సభ్యులలో కనీసం నాలుగవ వంతు మందిగాని, లేక 25 మంది గాని ఏది తక్కువైన ఆ సంఖ్యకు సరిపోయే మంది హాజరు కావడం అవసరం (కోరం) ఇట్లా అమూదించే సవరణలు సహకార సంఘాల రిజిస్ట్రార్ చేత రిజిస్ట్రేషన్ చేయబడిన తర్వాత ఆచరణలోనికి వస్తాయి.

43 : ఈ ఉప నియమావళి 1964 సం. ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టానికి 1964 సం. ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల రూల్స్ కు అనుగుణ్యమైనది. ఈ బై-లాస్ లో ప్రత్యేకంగా పేర్కొంటే తప్ప అన్నీ పైన చెప్పిన చట్టం రూల్స్ మరియు సహకార శాఖ సర్కులర్స్ ప్రకారం నిర్ణయించబడగలవు, వానిననుసరించి సంఘం నడచుకోవలెను. యీ నిబంధనావళి చదివి వినపించడమైనది.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.