ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
ఆ నల్లని ఆకాశంలో కానరాని
భాస్కరులెందరో.. ఓ.. ఓ.. ఓ.. ఓ
ఆ చల్లని సముద్ర గర్భం
దాచిన బడబానలమెంతో..
భూగోళం పుట్టుక కోసం కూలిన సుర గోళాలెన్నో
ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
భూగోళం పుట్టుక కోసం కూలిన సుర గోళాలెన్నో
ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
ఒక రాజుని గెలిపించుటలో
ఒరిగిన నర కంఠాలెన్నో
ఒక రాజుని గెలిపించుటలో
ఒరిగిన నర కంఠాలెన్నో
శ్రమ జీవుల పచ్చి నెత్తురులు
తాగని ధనవంతులెందరో
శ్రమ జీవుల పచ్చి నెత్తురులు
తాగని ధనవంతులెందరో
ఆ చల్లని సముద్ర గర్భం
దాచిన బడబానలమెంతో....
అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం
కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం
కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
అనగారిన అగ్ని పర్వతం కనిపెంచిన లావా ఎంతో
అనగారిన అగ్ని పర్వతం కనిపెంచిన లావా ఎంతో
ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో
ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో
ఆ చల్లని సముద్ర గర్భం
దాచిన బడబానలమెంతో....
పసిపాపల నిదుర కనులలో
ముసిరిన భవితవ్యం ఎంతో
గాయపడిన కవి గుండెల్లో
రాయబడని కావ్యాలెన్నో
పసిపాపల నిదుర కనులలో
ముసిరిన భవితవ్యం ఎంతో
గాయపడిన కవి గుండెల్లో
రాయబడని కావ్యాలెన్నో
కుల మతాల సుడిగుండాలకు
బలియైన పవిత్రులెందరో
కుల మతాల సుడిగుండాలకు
బలియైన పవిత్రులెందరో
భరతావని బలపరాక్రమం చెర వీడేదింకెన్నాల్లో
భరతావని బలపరాక్రమం చెర వీడేదింకెన్నాల్లో
ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
ఆ నల్లని ఆకాశంలో కానరాని
భాస్కరులెందరో.. ఓ.. ఓ.. ఓ.. ఓ
ఆ చల్లని సముద్ర గర్భం
దాచిన బడబానలమెంతో..
ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో - దాశరథి కృష్ణమాచార్యులు
Sunday, September 07, 2025
0