గురు బోధ 🔔

నోటి మీద అదుపు లేకపోవడం వలన చేప, స్పర్శ మీద నిగ్రహం లేక ఏనుగు, వినికిడి మీద నిగ్రహం లేక జింక, కంటి మీద నిగ్రహం లేక మిడత పతనం అయ్యాయి.

వాటికి కేవలం ఒక్క ఇంద్రియం మీద నిగ్రహం లేకపోవడం వల్లనే అవి నాశనమైతే... మనిషికి తన పంచేంద్రియాల మీద నిగ్రహం లేదు. అతడి పతనం ఎలా ఉంటుందో ఆలోచించండి.

మానవునికి తన కళ్ళ మీద నిగ్రహం లేదు, ఏవి చూడకూడదో అవే చూస్తున్నాడు. తన చెవుల మీద తనకు నిగ్రహం లేదు, ఏది వినకూడదో అదే వింటున్నాడు. తనకు నోటి మీద నిగ్రహం అసలే లేదు. అనవసరమైనవంతా మాట్లాడుతున్నాడు.

అలాగే మనం పీల్చే వాసనలు మనలో ఉద్రేకాన్ని కలిగించేవిగా, తమో గుణాన్ని పెంచేవిగనే ఉంటున్నాయి. స్పర్శ విషయంలో కూడా అంతే. మనం స్వీకరించిన ఆహారంలో ఆరవ వంతు మనస్సుగా మారుతుందని ఛాందగ్యోపనిషత్తు చెబుతోంది. 

ఇంతకీ ఆహరం అంటే ఏంటి.? కేవలం నోటి ద్వారా మాత్రమే తీసుకునేది కాదు, కళ్ళ ద్వారా చూసేది, చెవుల ద్వారా వినేది, ముక్కు ద్వారా వాసన పీల్చేది, స్పృశించేది కూడా మనస్సుగా మారుతోంది. అవన్నీ ఆహారమే.

మనకు ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు, నిషిద్ధమైన ఆహారాన్ని స్వీకరిస్తున్నప్పుడు, మంచి ఆలోచనలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి. మంచి పనులు చేయమంటే ఎలా చేస్తాము. మన శరీరమంతా అశుద్ధమైన, ధర్మబద్ధం కాని, అనైతికమైన ఆహారంతో ఏర్పడుతోంది, దానితోనే నిండుతోంది. అందుకే సమాజంలో మనుషులు పెడద్రోవ పడుతున్నారు...

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.