కొత్తగా ఎంప్లాయ్ ఐడి కి నిధి పోర్టల్ డేటాని నమోదు చేసే క్రమంలో కొన్ని ఎర్రర్స్ వస్తుంటాయి. వాటిపై కొంచెం అవగాహన కొరకు.
1) ఎంప్లాయ్ యొక్క ఆధార్ నెంబర్ నమోదు చేసి e-KYC చేసిన తర్వాత ఎంప్లాయ్ యొక్క నేమ్, డేట్ అఫ్ బర్త్ వంటి వివరాలు రావడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఎంప్లాయ్ యొక్క పేరు చిన్న అక్షరాలు (small letters తో రావడం జరుగుతుంది. అలాగే ఇంటి పేరు కూడా కలిపి రావడం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో దానిని ఎడిట్ చేయుటకు వీలు ఉంటుంది. పెద్ద అక్షరాలతో ( capital letters) update చేసుకోవాలి. ఇంటి పేరు కలిపి వచ్చినచో దానిని విడగొట్టి నమోదు చేయవలెను.
2) DoB తప్పుగా వచ్చినచో ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
3) అలాగే కొంతమందికి ఎంప్లాయ్ ఐడి ఆల్రెడీ ఉన్నది అని వస్తుంది. ఇది రెండు విధములుగా ఉంటుంది. ఒకటి 10 అంకెల వండర్ కోడ్ ప్రభుత్వ పథకాలలో భాగంగా ఇవ్వడం జరిగింది ఉంటుంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగిలు అమ్మ ఒడి వంటి పథకాలు పొందే క్రమంలో. దానిని సంబంధిత డి డి ఓ గారు వెండర్ బ్లాక్ అనే ఆప్షన్ (CFMS లాగిన్ లో ఉంటుంది) లో అది బ్లాక్ చేయవలసి ఉంటుంది. ఇక రెండవది 8 అంకెల CFMS ID ఉండటం జరుగుతుంది. ఆ ఎంప్లాయ్ ఇదివరకు ఏదో ఒక సర్వీస్ చేసి ఉండటం వలన ఈ నెంబర్ ఉంటుంది అంటే వాలంటీరుగా పనిచేయడం గానీ లేదా కాంటాక్ట్ ఎంప్లాయ్ గా పనిచేయడం చేయడం గానీ లేదా వేరే డిపార్ట్మెంట్లో పనిచేసే మరల వేరే డిపార్ట్మెంట్లో సెలక్ట్ అవ్వడం జరుగుతున్న సందర్భంలో ఇది వస్తుంది. దీన్ని పరిష్కారముగా ఇదివరకు పని చేసిన కార్యాలయం నందు transfer out అనే ఆప్షన్ లో రిజిగ్నేషన్ నమోదు చేయవలసి ఉంటుంది. కొత్తగా వచ్చిన ఆఫీస్ నందు transfer in లో Re-hearing అనే ఆప్షన్ ద్వారా ఇన్ చేసుకోవాలి.
4) బ్యాంకుల మెర్సింగ్ సందర్భంలో చాలా బ్యాంకులు వేరే బ్యాంకు మారడం జరిగింది.( ఆంధ్ర బ్యాంకు, గ్రామీణ బ్యాంకు వంటివి ) అటువంటివారు వారి యొక్క పాస్ బుక్ బ్యాంకుకు వెళ్లి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కొత్తగా వచ్చిన Bank account and IFSC నమోదు చేయవలసి ఉంటుంది. అలా కాకుండా పాత వివరాలతో నమోదు చేసిన తో ఆ రిక్వెస్ట్ ఫెయిల్ అవుతుంది.
5) PAN నమోదు చేసేటప్పుడు విధిగా చేయవలసి ఉంటుంది. ఏ ఒక్క లెటర్ తప్పుగా కొట్టిన అది ఎర్రగా వచ్చి ఆగిపోతుంది.
6) వెకెంట్ పొజిషన్ ఐడి సెలక్షన్ యందు జాగ్రత్తగా చూసుకుని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. అలా కాని పక్షంలో బిల్లు లో ఆ వ్యక్తి కనిపించరు.
7) ఇక ఎంప్లాయ్ ఐడి ఇష్యూ అయిన తర్వాత CPS (NPS) PRAN నెంబర్కు రిక్వెస్ట్ చేయవలసి ఉంటుంది. ఈ సందర్భంలో ఫోటోను అలాగే స్కాన్డ్ సిగ్నేచర్ సరైన సైజులో కట్ చేసుకోవాలని పెట్టవలసి ఉంటుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ నల్లగా లేకుండా చూసుకోవాలి. ఈ PRAN No నెంబర్ ఇదివరకు కార్వే కన్సల్టెన్సీ ద్వారా ఇవ్వడం జరిగేది. ఇప్పుడు అది ట్రెజరీలో ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. ఈ సందర్భంలో చాలా వ్యాలిడిటీ అయిన తర్వాతే జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంలో కూడా కొన్ని ఎర్రర్స్ రావడం జరుగుతుంది.
8) అది ముఖ్యంగా కొంతమంది బ్యాంకులో సొంతంగా PRAN No తీసుకుని సేవింగ్ చేసుకోవడం జరుగుతుంది. అటువంటి వ్యక్తులకు మరల PRAN No జనరేట్ అవ్వదు. అటువంటివారు బ్యాంకు కు ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ను, డి డి ఓ రిజిస్ట్రేషన్ కు అప్డేట్ చేయించుకోవలసి ఉంటుంది. ఆ తదుపరి అది స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి రావడం జరిగింది PRAN కు జమ అవ్వటం జరుగుతుంది.
9) కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ లేదా కార్పొరేషన్ సంస్థల యందు పనిచేసే రావటం జరుగుతుంది. వారికి ఆల్రెడీ PRAN ఉండటం జరుగుతుంది. దానిని ఇదివరకు పని చేసిన ఆఫీస్ లో inter sector shifting form (ISSF)సబ్మిట్ చేసి సిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదివరకు ఆఫీసులో చేసిన తర్వాత ప్రస్తుతం పని చేసిన ట్రెజరీలో దానిని ఆమోదించవలసి ఉంటుంది.
PRAN No వచ్చిన తర్వాత మాత్రమే జీతం బిల్లు పెట్టవలసి ఉంటుంది. ఇదివరకు PRAN no చాలా సమయం పట్టేది ఈ సందర్భంలో మొదటి జీతం పెట్టుటకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎవరికైనా పైన తెలిపిన ఎర్రర్స్ వచ్చినచో వారికి మాత్రం మొదటి జీతం బిల్లు చేయుటకు మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మొదటి జీతం బిల్లు తో పాటుగా సంబంధిత డాక్యుమెంట్స్ అటాచ్ చేస్తూ ఫిజికల్ కాపీ ట్రెజరీకి ఇవ్వవలసి ఉంటుంది. దానిని ఫస్ట్ అపాయింట్మెంట్ రిజిస్టర్ లో నమోదు చేసి ట్రెజరీ వారు భద్ర పరచవలసి ఉంటుంది. తదుపరి ఆడిట్ నందు చూపించవలసి ఉంటుంది.