MACSs Societies పైన Cooperation Department కి అధికారాలు లేవా ?

మనలో చాలామంది 1964 ఆక్ట్ లో డిపార్ట్మెంట్ కి చాలా powers ఉన్నట్లుగా అలాగే మాక్స్ -1995 యాక్ట్ లో  డిపార్ట్మెంట్ కి అధికారాలు లేవని, మాక్స్ సొసైటీ వాళ్ళ కన్నా మన డిపార్ట్మెంట్ వాళ్లే ఎక్కువ ప్రచారం చేస్తూ ఉంటారు.

ఆర్థిక నేరాలు లేదా ఆర్థిక అవకతవకలు మరియు బైలాస్ కి, ఆక్ట్ ప్రొవిజన్స్ కి విరుద్ధంగా ప్రవర్తించనంత వరకు, సాధారణంగా రెండు యాక్ట్ లలోను సొసైటీస్  స్వతంత్రత కలిగి ఉన్నవి.

 1964 ఆక్ట్ లో చాలా విషయాలలో డిపార్ట్మెంట్ ప్రమేయం ఉంటుంది, అదే 1995 మ్యాక్స్ లో తక్కువ విషయాల్లో మాత్రమే ఉంటుంది. 

అయితే MACS సొసైటీ లలో ఆర్థిక నేరాలు జరిగినప్పుడు, Bye laws కు విరుద్ధంగా Board /G.B వ్యవహరించినప్పుడు, తప్పనిసరిగా యాక్షన్ తీసుకునే అధికారాలు DCOs కు మ్యాక్స్ యాక్ట్ ఇస్తుంది U/s 38.

ఎలాగంటే, 1964 ఆక్ట్ లో సివిల్ అండ్ క్రిమినల్ కేసులు ఫైల్ చేయాలంటే ఎంక్వయిరీ గానీ ఇన్స్పెక్షన్ గానీ చేయాలి ( U/s 50,51,52,53) ఆ పైన సర్ ఛార్జ్ ఇష్యూ చేయాలి U/s 60, కానీ 1995 యాక్ట్ లో U/s 29 enquiry చేయకుండానే, Annual రిటర్న్స్ ఇవ్వకపోయినా, తప్పుగా ఇచ్చినా, సమాచారాన్ని దాచిపెట్టినా, నేరుగా క్రిమినల్  కేసు ఫైల్ చేసే అధికారాలు మ్యాక్స్ ఆక్ట్ ఇస్తుంది U/s 38 .

MACS లో అయితే  మాత్రం U/s 29 enquiry  పూర్తి అయిన తర్వాత Registrar  కి (RCS ,DCO) Surcharge Order చేసే provision ఇవ్వలేదు 

అయితే ఈ surcharge చేయకపోయినప్పటికీ , Society నిధులు Misappropriation  తేలితే, RCS, DCOs  కి ఈ అధికారాలు మాక్స్ ఇచ్చింది U/s 31, 38.

1.Civil action 

2. Criminal action

3. Enquiry రిపోర్ట్ G.B కి పంపడం.

4. తదుపరి చర్యలకు ట్రిబ్యునల్ ను ఆశ్రయించడం.

Civil actions 

1. మొత్తం M.C రద్దు చేయడము లేదా సంబంధిత డైరెక్టర్లను తొలగించుట .

2. ఎంప్లాయ్ పైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని G.B కి తెలపడం.

3. బోర్డు తీసుకొన్న నిర్ణయాలను రద్దు చేయడము.

4. G.B నిర్ణయాలను కూడా యాక్ట్ విరుద్ధముగా ఉంటే రద్దు చేయడము.

 Criminal actions

1. మొత్తం M.C మీద లేదా కొందరు డైరెక్టర్లు ల మీద లేదా ఎంప్లాయిస్ మీద నేరుగా పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు ఫైల్ చేయడం.

2. క్రిమినల్ కేసులు ఫైల్ చెయ్యడంలో ట్రిబ్యునల్ అనుమతి అవసరము లేదు u/s 31.(1).

 G.B కి enquiry రిపోర్ట్ పంపించడం

1. U/s 29 క్రింద నిర్వహించిన ఎంక్వయిరీ రిపోర్ట్ ని సొసైటీ జనరల్ బాడీకి పంపించాలి. 

2. అయితే జనరల్ బాడీ ఈ రిపోర్ట్ ని, ఆమోదించిన, తిరస్కరించిన వారి నిర్ణయాలతో DCO కి పనిలేదు.

3. ఆక్ట్ లో ఎక్కడ రిపోర్టు మీద జనరల్ బాడీ అభిప్రాయం ప్రకారమే ముందుకెళ్ళమని తెలుపలేదు . 

4. కోట్ల రూపాయల  Misappropriation ను తేల్చిన ఎంక్వైరీ రిపోర్టులను జనరల్ బాడీ లు తిరస్కరిస్తున్నాయి, వారి తిరస్కరణతో మనకు సంబంధం లేదు.

5. 1964 ఆక్ట్ లో కూడా ఎంక్వయిరీ లేదా ఇన్స్పెక్షన్ రిపోర్ట్ను జనరల్ బాడీకి పంపిస్తాము, G.B నిర్ణయాలతో మనకు సంబంధం ఉండదు కదా, అలాగే 1995 యాక్ట్ లో కూడా .

 4.Tribunal ను ఆశ్రయించడం

1. తదుపరి చర్యలు అంటే కేవలము సివిల్ కేస్ కి మాత్రమే ఆశ్రయించాలి. 

2. క్రిమినల్ కేసు ఫైల్ చేయాలంటే, ట్రిబ్యునల్ ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు, స్పెషల్ ఆడిట్ మీద లేదా ఎంక్వయిరీ మీద.

3. కేవలం సంఘ నిధులను దుర్వినియోగించేసిన వారి ఆస్తులపై Attachment ( జప్తు)చేయాలన్నప్పుడు మాత్రమే ట్రిబ్యునల్ ను ఆశ్రయించాలి.

సొసైటీని రద్దు చేయడం ( ఈ అధికారము RCS మాత్రమే ఉన్నది, DCO కు లేదు , RCS Authorise చేస్తే DCOs వస్తుంది)

1. చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన, రిజిస్ట్రార్  నోటీసులను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసిన మరికొన్ని కారణాలతో సంఘాన్ని  రద్దు చేయవలసినదిగా Tribunal ను కోరవచ్చు U/s 40(a,b,c,d,e,f).

2. చట్ట విరుద్ధంగా అంటే స్పెషల్ ఆడిట్లో గాని ఎంక్వయిరీలో గాని సంఘ నిధులు దుర్వినియోగము అయ్యాయని , G.Bs కి రిఫర్ చేస్తే, ఆ రిపోర్ట్స్ లను ఎలాంటి Valid కారణాలు లేకుండానే తిరస్కరిస్తున్నాయి, అంటే అవినీతిని సంఘమంతా సమర్థిస్తున్నాయని అర్థం, తద్వారా సొసైటీని రద్దు చెయ్యమని కోరే అధికారము ఉన్నది.

 పాలకవర్గాన్ని/Board ను రద్దు చేయడం

1. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోయినట్లయితే, on concern Registrar (DCO) can take necessaryaction, దీనికోసం Tribunal ని ఆశ్రయించాల్సిన పనిలేదు U/s 21(6-a)

2. G.B  నిర్వహించపోయిన, ఆడిట్ రిపోర్ట్ ని G.B లో పెట్టకపోయినా, U/s21(6-b,C),38(b).

DCOs కు మాక్స్ లో U/s 4, 10, 21, 34, 38 లో బలమైన, స్పష్టమైన అధికారాలు ఇవ్వబడినవి . 

మాక్స్ యాక్ట్ లో U/s 28,29,40 (Spl.Audit, Inquiry, Liquidation) మినహా , మిగిలిన అన్ని అధికారాలు DCOs  కి  ఇవ్వబడినవి G.O.No.118.

ఇటీవల మాక్స్ రుద్రమదేవి vs DCO - Jangaon కేసులో కూడా మ్యాక్స్ లో RCS ,DCOs ల అధికారాలను సంపూర్ణంగా గౌరవ Telangana Cooperative Tribunal  అంగీకరించింది , అలాగే గౌరవ హైకోర్టు కూడా అంగీకరించిన కేసులు ఉన్నవి.

యాక్షన్ తీసుకునే ముందు నోటీసులు ఇచ్చి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి, Due procedure నీ తప్పనిసరిగా ఫాలో అవ్వాలి.

మాక్స్ సొసైటీలో ఎలైట్ వ్యక్తులు, బాగా పలుకబడి ఉన్న వాళ్ళు ఉండడం చేత, ఫీల్డ్ స్టాఫ్ అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందికర/ బయటి చెప్పుకోలేని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 

వీటిని పరిష్కరించే నిమిత్తం, మ్యాక్స్ ఆక్ట్ పైన రూల్స్ , గైడ్లైన్స్ ఇవ్వాలి.

చేయాలనుకున్నట్లయితే stick కూడా Gun అవుతుంది, వద్దనుకున్నట్లయితే Gun కూడా Stick కన్నా బలహీనమవుతుంది, MACS act అధికారాలు కూడా అంతే.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.