I. ప్రవర్తన నియమావళి – సూక్తులు
1. దేశం
ఇచ్చే బహుమతి ప్రాథమిక హక్కులైతే, వాటికి హద్దులుండకూడదని అర్థం కాదు...... అంబేద్కర్
2. మనుష్యులలో
స్వతహాగా ఏ కొద్దిపాటో అవినీతి స్వభావం వుంటుంది. వారు జన్మతః అవినీతి రక్కసులై
వుండరు. తరువాత తరువాతనే వారు అవినీతి సామ్రాట్టులుగా మారి వుంటారు....... వాల్టేర్
3. అధికారి
అన్నవాడు మృదుమధురంగా మాట్లాడడం నేర్చుకోవాలి....... బద్దెన
4. ప్రవర్తన
అద్దం లాంటిది. ప్రతి మనిషి ప్రతిబింబం అందులో కనుబడుతుంది...... గోథే
5. దేశంలో
అవినీతి ఎక్కువైన కొద్దీ చట్టాలు, నీతి సూత్రాలు ఎక్కువవుతుంటాయి...... హన్ టన్
6. ప్రతి
వ్యక్తి తనంతతానుగా నిజాయితీపరుడై వుండాలి...... మార్కస్ ఆర్లియస్
7. విధి
నిర్వహణకు మించిన దేశ సేవ లేదు...... గాంధీ
8. నీ
వద్దకు వచ్చిన వారికి చేతనైనంత ఉపకారం చేయగలవు. దేవుడు సంతోషిస్తాడు..... షిర్డి
సాయి బాబా
9. అధికారంలో
వుండగా ఒక వ్యక్తి ఏం చేస్తాడన్నదే అతని వ్యక్తిత్వానికి కొలమానం..... పిట్టాకస్
10. ఒకని గుణగణాలను పరిశీలించాలనుకుంటే, అతనికి ఒకసారి
అధికారం ఇస్తే చాలు....... అబ్రహాం లింకన్
11. చిన్న నేరాలను ఉపేక్షిస్తే, అవి పెద్ద పెద్ద ఘోరాలకు
దారి తీస్తాయి..... రస్కిన్
12. తప్పుడు ఆలోచనలు ఆలస్యంగానైనా దుష్ఫలితాలు ఇస్తాయి.......ఐన్ స్టీన్
13. సరిదిద్దకుండా వదిలేసిన తప్పును మించిన ఆపద మరొకటి
లేదు....... బాస్సా
14. ప్రతి పౌరుడు హక్కులను మాత్రమే కోరుకుంటూ, బాధ్యతలను
విస్మరిస్తే, అది అరాచకం అవుతుంది....... గాంధీ
15. మీరు కార్యాలయానికి వెళ్ళేటప్పుడు కనిపించే
వ్యక్తులను హాయిగా నవ్వుతూ పలకరించండి. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు మీకు వాళ్లే
కనిపిస్తారు కదా..... విల్సన్ మిజ్నర్
16. అదృష్టం వల్ల మంచి ఉద్యోగం రావచ్చునేమో కానీ, ఆ
ఉద్యోగాన్ని నిలుపుకోవడానికి ఆ అదృష్టం
చాలదు......జె. ఆర్మర్
17. చెడును ఉపేక్షించినవాడు మంచిని నిర్లక్ష్యం
చేస్తున్నాడన్న మాట......టాల్ స్టాయ్
18. నా కూతురు నేరం చేసినా, ఆ చేయిని నరికి
వేయాలి.........మహమ్మద్ ప్రవక్త
19. మీరు ఎంత గొప్పవారైనా, నేరం చేస్తే , ఎప్పుడో
ఒకప్పుడు చట్టానికి పట్టుపడక తప్పదు....వి.ఆర్ కృష్ణయ్యర్
20. విచారణకు భయపడి పారిపోయే వ్యక్తి తన నేరాన్ని
అంగీకరించినట్లే.....సైరన్
21. సమాజంలో సోమరిపోతులైనవారు దొంగలతో సమానం......గాంధీ
22. పని చేయనివాడే కాదు, పని బాగా చేయనివాడు కూడా సోమరిపోతే.....
సోక్రటీస్
23. చిరు నీతివాక్యాలే మనిషి ప్రవర్తించవలసిన పద్ధతులను
నేర్పేది... ప్యాలే
24. ప్రతి మనిషి జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం –
తన పట్ల తాను నిజాయితీగా వ్వవహరించగలగడం..... షేక్స్పియర్
25. అనేక పొరపాట్లకు జాప్యమే కారణం....... జెఫర్ సన్
26. నైతిక విలువలను మానవ జీవితంలో రంగరించుకోగలిగిన సమాజం
ఎల్లవేళలా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది..... జాన్ రస్కిన్
27. చక్కగా పని చేయకుండా ఎవరూ ఫలితాలను పొందలేరు....... శ్రీ కృష్ణ భగవానుడు
§ ఆంగ్లేయ ప్రభుత్వం మొట్టమొదటగా 1904 లో ‘ప్రభుత్వ సేవకుల ప్రవర్తనా నియమావళి’ ని రూపొందించింది.
§ ఆంధ్రప్రదేశ్ లో 1958 లో ‘ప్రభుత్వ సేవకుల ప్రవర్తనా నియమావళి’ అమలులోకి వచ్చింది.
§ మళ్ళీ 1964 లో జీవో ఎంఎస్ నెం. 468 జీఏడి తేది 17/04/1964 ను అనుసరిస్తూ ‘ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వఉద్యోగుల ప్రవర్తన నియమావళి,1964 ను అమలు లోకి తీసుకురావడం జరిగింది.
§ ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వఉద్యోగుల ప్రవర్తన నియమావళి,1964 లో 29 నియమాలు వున్నాయి.
§ భారత రాజ్యాంగంలోని 309
అధికరణ లోని నిబంధనను అనుసరించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారికి ప్రభుత్వ
ఉద్యోగుల ప్రవర్తనను నియంత్రించడానికి అధికారం కలిగి వున్నారు.
§ ఇందులో ప్రభుత్వ
ఉద్యోగులు ఏం చేయాలో, ఏం చేయకూడదో వివరించబడినవి.
§ విధుల నిర్వహణలో ఉద్యోగుల
ప్రవర్తన మరియు ప్రజలతో మెలిగే తీరు బట్టి ప్రభుత్వం యొక్క సామర్థ్యం ఆధారపడి
వుంటుంది.
§ ఉద్యోగుల దుర్వర్తన
ప్రభుత్వం మీద ప్రభావం చూపుతుంది కాబట్టి, ప్రభుత్వ ప్రయోజనాల రీత్యా, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, ప్రవర్తనా నియమావళిని
రూపొందించడం ద్వారా ఉద్యోగుల ప్రవర్తనను ప్రభుత్వం నియంత్రిస్తుంది.
§ దుర్వర్తనకు పాల్పడ్డ
ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల
ప్రవర్తనా నియమావళి, 1964 కింద బాధ్యులవుతారు.
§ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ
ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి, 1964, ప్రభుత్వ ఉద్యోగులు తమ
ఉద్యోగ ప్రస్థానం లో చేయవలసిన & చేయకూడని పనులను విశదీకరించినది.
§ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ
ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి, 1964 లోని Rule 1(2) వ నియమం అనుసరించి ఈ
నియమాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ లోని ప్రభుత్వ
ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతో సంబంధమున్న ఉద్యోగులకు
వర్తిస్తాయి.
§ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ
ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి, 1964 లోని Rule 2 (5) వ నియమం ప్రకారం ఈ
నియమాలు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తాయి. కుటుంబ సభ్యులనగా
ప్రభుత్వ ఉద్యోగి యొక్క భార్య లేదా భర్త, కుమారుడు, కుమార్తె, సవతి కొడుకు, సవతి
కూతురు.....వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగితో కలిసి నివసిస్తున్నా, నివశించలేకపోయినా & సంబంధీకులు ఎవరైనా
ప్రభుత్వ ఉద్యోగితో కలిసి నివసిస్తున్ననూ........ వీరందరూ ప్రభుత్వ ఉద్యోగి యొక్క
కుటుంబ సభ్యులే.
II.
ప్రభుత్వఉద్యోగులు చేయవలసిన పనులు (DOs)
2. సత్వరత & మర్యాద (PROMPT & COURTEOUS) - Rule 3(B)
3. తమ కింది సిబ్బందిలో సంపూర్ణ
నైతిక నిష్టత (ABSOLUTE INTEGRITY) & విధి పట్ల భక్తి భావం (DEVOTION TO DUTY) పెంపొందించే బాధ్యత పై స్థాయి అధికారులపై వున్నది. అలవాటు ప్రకారం కాలాయాపన చేయడం, సరిగ్గా పని చేయకపోవడం
వంటి దుర్వర్తనాలు...... విధి పట్ల భక్తి
భావం (DEVOTION TO DUTY) లేకపోవడం కిందికి వస్తాయి - G.O.Ms.No.381, GAD, Dt.18/12/2003 - Rule 3(5).
4. 10,000 రూ.. దాటిన విదేశీ నిధులను
స్వీకరించిన 15 రోజులలోపు తెలపాలి - GO.Ms.No.354, GAD, Dt: 08/08/1996) - Rule 6(A).
5. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి
ఉద్యోగంలో చేరిన వెంటనే, (చివరి గ్రేడు ఉద్యోగులు తప్ప) ఆస్తుల ప్రకటన (STATEMENT OF PROPERTY) చేయాలి - Rule 9 Sub Rule 7; Rule 9 Sub Rule 7 లోని అనుబంధం 1 & 2 లో రూ 1 లక్ష
దాటిన చరాస్తుల వివరాలు, ఎంత విలువైనా సరే స్థిరాస్తుల వివరాలు ప్రకటించాలి. GO.Ms No. 528, GAD, Dt:19/08/2008 ప్రకారం రూ 20,000 చరాస్తుల విలువను రూ 1 లక్షకు
పెంచడమైనది) అలాగే ప్రతి సంవత్సరం జనవరి 15
లోపల, అదే అనుబంధం 1 & 2 లో స్థిరాస్తుల చరాస్తుల వివరాలు ప్రకటించాలి. (Circular Memo No. 695/Ser C/2006,
GAD, Dated 12/10/2006) ముందస్తు అనుమతితోనే, ఎంత విలువైనా సరే స్థిరాస్తులు, రూ 1 లక్ష దాటే
చరాస్తుల కొనుగోలు కానీ, అమ్మకం కానీ చేయాలి. 30 రోజుల ముందుగానే అనుమతి కొరకు
దరఖాస్తు చేయాలి. ఒక నెల ముందుగానే, కొనుగోలుకు
కానీ, అమ్మకం కొరకు కానీప్రభుత్వానికి అనుమతి కొరకు దరఖాస్తు చేస్కున్న తర్వాత,
(రశీదు తప్పనిసరి), ఒక నెల లోపు అనుమతి రాకపోయినా... అమ్మకానికి, కొనుగోలుకు పాల్పడవచ్చును - G.O.Ms.No.26, GAD, Dt:20/01/1998
6. వ్యక్తిగత జీవితంలో బాధ్యతాయుతమైన, సభ్యత, ప్రామాణికతతో కూడిన ప్రవర్తన కలిగి వుండాలి.
7. ప్రజలకు సత్వరంగా & మర్యాదపూర్వకంగా సేవలందించాలి.
8. మధ్యాహ్న భోజన విరామ సమయంలో హుందా ప్రవర్తన కనబరచాలి.
9. రాజకీయ పక్షాల ప్రదర్శనలలో పాల్గొనకుండా వుండాలి
10. రాజకీయ తటస్థత పాటించాలి.
11. అప్పులు తీస్కొనడం, దివాలా కు పాల్పడడం లాంటి వాటికి దూరంగా వుండాలి.
12. ఏదైనా ఋణాల బకాయిల చెల్లింపులో గానీ, మిమ్మల్ని దివాలా
అయినట్టు ప్రకటించడంలో గానీ వున్న న్యాయపరమైన అంశాలన్నీ దాపరికం లేకుండా
ఉన్నతాధికారులకు నివేదించాలి.
13. పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నప్పుడు (ARREST), క్రిమినల్ న్యాయస్థానం
శిక్ష విధించినపుడు ఉన్నతాధికారులకు నివేదించవలెను.
14. ప్రభుత్వానికి విశ్వసనీయమైన సేవకుడిలా వుండాలి.
15. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం శ్రమించాలి
16. ప్రజలకు ‘నిర్ణీత కాల వ్వవధి’ (SLA = SERVICE LEVEL AGREEMENT) లోపల సేవలు అందజేయబడాలి.
17. సమయపాలన పాటించాలి
18. ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ సామాగ్రిని జాగ్రత్తగా చూసుకోవలెను.
19. సానుకూల దృక్పథం కలిగి వుండాలి
20. నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
21. తాజా సమాచారం, అభివృద్ధి పరిచిన పరిజ్ఞానం కలిగి వుండవలెను
22. మొదట వచ్చిన వారికి ప్రాధాన్యతను అమలు చేయాలి
23. వృత్తి పని పట్టిక (JOB CHART) లోని విధులు, బాధ్యతలు క్షుణ్ణంగా తెలుసుకుని అమలు
చేయాలి
24. ముందస్తు అనుమతి & మంజూరీతోనే యాదృచ్ఛిక సెలవు (CASUAL LEAVE) తీసుకోవాలి.
25. చక్కని ఆదర్శ వేషధారణ కలిగి వుండాలి.
26. కార్యాలయాల్లో, కార్యాలయ పరిసరాలలో, గ్రామాలలో పరిశుభ్రతకు, పచ్చదనానికి ప్రాముఖ్యత ఇవ్వాలి
27. సున్నితమైన కులపరమైన,
మతపరమైన, ఆచార సంబంధమైన అంశాలలో సమభావన, సహనభావన కలిగి వుండాలి.
28. రాగద్వేషాలకు, పూర్వ ఉద్వేగాలకు అతీతంగా వుండాలి.
29. ప్రజలందరినీ తారతమ్యాలు లేకుండా సమానాదరంతో గౌరవించాలి
30. ప్రజలకు నిత్యం అందుబాటులో, తలలో నాలుకలాగా వుండాలి.
31. ఎల్లవేళలా ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి.
32. ప్రజల కోసమే మనం, ప్రజలతోనే మనం అన్న భావనతో పని చేయాలి.
III.
ప్రభుత్వఉద్యోగులు చేయకూడని పనులు (DONTs)
1. అనుచిత ప్రవర్తన కలిగి వుండరాదు (UNBECOMING MANNER) - Rule 3(2); అనుచిత ప్రవర్తన అనగా …… అ) అమర్యాద వైఖరి (UNMATTERLY ATTITUDE); ఆ) అవిధేయత (INSUBORDINATION); ఇ) హుందా ప్రవర్తన లేకపోవడం (LACK OF DECORUM); ఈ) సోమరితనం (LAZINESS); ఉ) అవినీతి అలవాట్లు (CORRUPT HABITS); ఊ) బాధ్యతలను తప్పించుకోవడం (SHIRKING OF RESPONSIBILITY); ప్రభుత్వ ప్రతిష్ఠతకు భంగకరమయ్యే ప్రవర్తన (DEROGATORY TO THE PRESTIGE OF THE GOVERNMENT) కలిగి వుండరాదు.
2. తన అధికార స్థానం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చునట్లు (EMBARASSMENT) ఏ ప్రభుత్వ
ఉద్యోగి ప్రవర్తించరాదు - Rule 3(3).
3. పై అధికారుల ఆదేశాలు కొరకో, వారి ఆమోదం కొరకో కారణాలు పెట్టి
విధులు ఎగవేయరాదు (EVADE) - Rule 3(4).
4. 14 ఏళ్ల లోపు పిల్లల చేత
పనులు చేయించరాదు - Rule 3(6); (G.O. MS No. 555, GAD, Dated 14/12/2005).
5. భారత దేశపు సార్వభౌమ్యాధికారానికి, సమగ్రతకు ప్రతికూలమైన కార్యకాలాపాలలలో
పాల్గొనరాదు, అట్టి సంఘాలలో సభ్యులుగా వుండరాదు - Rule 3(A)
6. అధికార విధులలో అమర్యాదగా వ్యవహించరాదు - Rule (3B)
7. కాలాయాపన యుక్తులకు (DILATORY TACTICS) & ఉద్దేశపూర్వకంగా కాలాయాపణకు
(DELAY) పాల్పడరాదు - Rule 3(Bb) - GO.MS No.72, GAD, Dt: 03/03/1998.
8. సాటి మహిళా ఉద్యోగులతో
అమర్యాదగా ప్రవర్తించరాదు - Rule 3(C)
9. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడరాదు - Rule 3(C)
10. అసభ్య చిత్రాలను చూపుట నేరం - Rule 3(C)d,
11. లైంగిక సూచికలు, సైగలు శిక్షార్హం - (Rule 3(C)e) (Rule 3(C)) లోని నిషేధిత
దుర్వర్తనములకు బాధ్యులైన వారి మీద బారత శిక్షా స్మృతి, 1860 ఇతర చట్టాల ప్రకారమూ
శిక్షార్హులు – GO.Ms.No. 322, GAD, Dt:19/12/2005.
12. సమ్మెలు నిషేధం - Rule 4: సమ్మెలలో, లేదా, అలాంటివి, లేదా, సమ్మెలకు ప్రేరణ కల్గించే వాటిల్లో పాల్గొనరాదు
13. అనుమతి లేకుండా గైర్హాజరీ కాకూడదు - Rule 4(1)
14. అధికారిపై/ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడానికై పని యందు నిర్లక్ష్యం
లేదా పని చేయకపోవడం చేయరాదు - Rule 4(2)
15. అధికారిపై/ప్రభుత్వంపై వత్తిడి తేవడానికై ‘నిరాహారాదీక్ష’ చేయరాదు - Rule 4(3)
16. రాజకీయ పక్షాల ప్రదర్శనలలో పాల్గొనరాదు - Rule 5
17. వస్తు రూపేణా, డబ్బు రూపేణా కానుకలు స్వీకరించరాదు, సేవలు పొందరాదు - Rule 6; GO.Ms.No.205, GAD, Dt: 05/06/1998
ప్రకారం...... ఏదైనా
అధికారిక పని చేయడానికి, చేయకుండా వుండడానికి ఏదైనా ప్రతిఫలం (GRATIFICATION) తీసుకున్నట్లు నిరూపణ అయితే,
అర్హతతో కూడిన తొలగింపు (REMOVAL) లేదా
అనర్హతతో కూడిన తొలగింపు (DISMISSAL) శిక్షగా
విధిస్తారు.
18. చందాలు వసూలు చేయరాదు - Rule 7
19. అప్పులు ఇవ్వడం, తీస్కోవడం, దివాలా తీయడం (INSOLVENCY) వంటివి నిషేధము - Rule 8
20. అనుమతి లేకుండా స్థిరాస్తుల, చరాస్తుల కొనుగోలు & అమ్మకం చేయరాదు - Rule 9
21. ప్రైవేటు వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు నిషేధము - Rule 10
22. ప్రైవేటు కంపెనీల నిర్వహణ, తోడ్పాటు చేయరాదు - Rule 11
23. ప్రైవేటు ఉద్యోగాలు చేయరాదు - Rule 12
24. పుస్తకాల ప్రచురణ నిషేధం - Rule 13
25. రహస్య పత్రాలను & అధికారిక సమాచారాన్ని వెల్లడి చేయరాదు - Rule 14
26. వార్తాపత్రికలతో సంబంధాలు వుండరాదు - Rule 15
27. ఆకాశవాణి ప్రసారాలలో పాల్గొనడం, వార్తా పత్రికలకు, వార
పత్రికలకు వ్యాసాలు, వార్తలు రాయడం నిషేధం - Rule 16
28. ప్రభుత్వ విధానాలను, కార్యక్రమాలను, పథకాలను, చర్యలను విమర్శించరాదు - Rule 17
29. ఏదైనా కమిటీ, కమీషన్ & ఇతర అధికార సంస్థల ముందు సాక్ష్యం ఇవ్వడం నిషేధం - Rule 18
30. రాజకీయాలలో, ఎన్నికలలో పాల్గొనడం నిషేధం - Rule 19
31. నేరసంబంధ చర్యలను, వ్యక్తులను సమర్థించరాదు (VINDICATION OF ACTS & CHARACTERS) - Rule 20
32. బంధువుల దగ్గర & బంధువుల క్రింద ఉద్యోగం చేయరాదు - Rule 21
33. ప్రైవేటు సంస్థలలో కుటుంబ సభ్యలకు ఉద్యోగాలు నిషేధం - Rule 22
34. తన అధికార హోదాను తన కొరకు, తన బంధువుల కొరకు, తన మీద ఆధారపడ్డ వాళ్ళ కొరకు ఉపయోగించరాదు - Rule 23
35. తన స్వప్రయోజనాలకై, తన ఉన్నతాధికారులపై వత్తిడి తీసుకొనరాదు, పలుకుబడిని ఉపయోగించరాదు (INFLUENCING AUTHORITIES FOR FURTHERANCE OF INTERESTS - Rule 24
36. రెండవ వివాహం (BIGAMY) చేసుకొనరాదు - Rule 25
37. వరకట్నం ఇవ్వడం, తీసుకొనడమూ రెండూ నిషేధమే - Rule 25 A - వరకట్న నిషేధ చట్టం, 1961.
38. మత్తపానీయాల సేవనం నిషేధము. బహిరంగ ప్రదేశాల్లో మత్తు
పదార్ధాల సేవనం చేయరాదు - Rule 26
39. ఇతరులకు తమ యూజర్ ఐడి & పాస్ వర్డ్ ఇవ్వరాదు.