Questions and Answers | ప్రశ్నలు - సమాధానాలు

సర్వీస్ పెన్షనర్ మరణించినప్పుడు సంబంధిత Sub Treasury Office కు death certificate తో పాటు ఏయే documents submit చేయాలో వివరముగా తెలుపగలరు.

If the service Pensioner died the Spouse  i.e., Husband or wife or the family members  i.e.. Son or daughters  should  submit the death certificate along with PPO to claim funeral charges and Pension due upto the date of death.Further if the Spouse should submit  Form F along with 1st page of Bank Passbook account,  Aadhar card, PAN card xerox Original  PPO  to The concerned  STO for sanction of family Pension.

సర్వీస్ పెన్షనర్ గాని, ఫ్యామిలీ పెన్షనర్ గాని మరణించిన సందర్భంలో వారి కుటుంబ సభ్యులు ఈ క్రింది అంశాలు  తెలుసుకోవలసి ఉంటుంది.

1)  సర్వీసు పెన్షనర్ / ప్యామలీ పెన్షనర్ మరణించినపుడు వారి వారసులు ట్రెజరీ వారికి డెత్ ఇంటిమేషన్ ఇవ్వాలి.పెన్షన్ నిలుపుదల చేయమని కోరాలి. ఇది నిర్ణీత ఫారంలోనే ఇవ్వాలని లేదు. ఓ తెల్లకాగితంపై పెన్షనర్కు సంబంధించిన పూర్తి వివరాలు అనగా ఎపుడు రిటైర్ అయింది,పిపివో నెంబరు, పిపివో ఐడి, సి ఎ ఫ్ యం యస్ నెంబరు,పెన్షన్ డ్రాచేయబడు చున్న బ్యాంకు పేరు,బ్రాంచి, ఐ ఎఫ్ యస్ సి కోడ్, సెల్ నెంబరు, చిరునామా వంటి వివరాలతో ఎపుడు, ఎక్కడ, ఎందువల్ల మరణించింది, మొదలగు వివరాలు తెలియ పరచుతూ ఓ లేఖ సంబంధిత ట్రెజరీ అధికారివారికి అందచేయాలి. వారు వెంటనే పెన్షన్ నిలుపుదల చేస్తారు. 

 2) పెన్షనర్ మరణించిన విషయము ట్రెజరీ అధికారులకు తెలియజేయకపోతే వారు యధావిధిగా పెన్షన్ మంజూరు చేస్తారు. సర్వీసుపెన్షనర్ / ప్యామలీ పెన్షనర్ మరణించిన తరువాత కుటుంబ సభ్యులు చట్ట రీత్య తెలిసిగాని , తెలియక గాని (Bank , ATM లో) పెన్షన్ డ్రా చేయరాదు. కొందరు కొన్ని నెలల వరకు కూడా పెన్షనర్ మరణించిన విషయము ట్రెజరీ అధికారులకు తెలుపకపోవటం వల్ల ఇబ్బందులు ఎదురవు తున్నాయి. చనిపోయిన విషయం తెలియ చేయడంవల్ల చనిపోయిన రోజు వరకు పెన్షన్ పెన్షనర్ ఖాతాకు ట్రెజరీవారు జమచేసి ఆపై పెన్షన్ నిలుపుదల చేస్తారు. తరువాత ప్యునరల్ చార్జీలు, ఏవేని అరియర్స్ రావలసిఉంటే అవి ప్యామలీ పెన్షనర్ లేదా వారసుల ఖాతాకు చెల్లిస్తారు. మనం డెత్ ఇంటిమేషన్ తెలియనిచో ట్రెజరీవారు యధావిధిగా ప్రతీనెల పెన్షన్ ఖాతాకు జమచేస్తారు. ఆపై మనం తెలియచేస్తే అప్పటివరకు అదనంగా చెల్లించిన మొత్తం చలానా రూపంలో తిరిగి ట్రెజరీకి జమచేసేవరకు ప్యూనరల్ చార్జీలు ,ప్యామలి పెన్షన్ వంటివి మంజూరు కావు.  డెత్ విషయం మనం తెలియచేయకుంటే ఏమౌంతుందిలే పెన్షన్ వచ్చేస్తుంది కదా అనుకుంటే తదుపరి లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వవలసిన గడువు వరకు పెన్షన్ వస్తుంది. కానీ ఈవిషయం తెలిసిన తరువాత పెన్షన్ డ్రా చేసినవారిపై క్రిమినల్ కేసులు రిజిష్టర్ చేస్తారు.
 
3) సర్వీస్ పెన్షనర్ మరణించినప్పుడు జీవించి ఉన్న ఫ్యామిలీ  పెన్షనర్  ఒక అప్లికేషన్, మరణ ధ్రువీకరణ పత్రం జతపరుచుచూ ట్రెజరీ అధికారి గారికి దరఖాస్తు పెట్టినచో అంత్యక్రియల ఖర్చులు మంజూరు చేస్తారు. ప్రస్తుతం PRC 2022 అనుసరించి అంత్యక్రియల ఖర్చు  25 వేల రూపాయలు  మంజూరు చేస్తారు.

11/5/2022 న  ప్రభుత్వం  PRC 2022 అమలు పై  జి. వో నెం: 105 ప్రకారం  ప్యునరల్ చార్జీలు రు. 25000/ గా  ఉత్తర్వులు -  జారీచేసింది.  (ఇప్పటివరకు ఉన్న 15000 లేదా ఒక నెల పెన్షన్ ఏది ఎక్కువైతే దానిని చెల్లించే వారు. ఈ జివో లో నెల పెన్షన్ రద్దుచేసి 25000 గా  ప్యునరల్ చార్జీలను  ఖరారు చేసారు).

 5)  సర్వీస్ పెన్షనర్ జీవించి ఉండి, ఫ్యామిలీ పెన్షనర్ మరణించిన సందర్భంలో కూడా అంత్యక్రియల ఖర్చులు మంజూరు చేస్తారు.

సర్వీసు పెన్షనర్ మరణిస్తే, డెత్ సర్టిఫికెట్ వచ్చిన తరువాత చనిపోయినసర్వీసు పెన్షనర్కు ఏజి కార్యాలయం నుండి మంజూరైన పిపివో లో నోట్ చేయబడిన ప్యామలీ పెన్షనర్ తనకు ప్యామిలీ పెన్షన్ మంజూరు చేయమని సంబంధిత యస్ టి వో గారికి పూర్తి వివరాలతో తనబ్యాంకు ఖాతా వివరాలు తెలుపుతూ లేఖ వ్రాస్తూ దానికి డెత్ సర్టిఫికెట్ ఒరిజినల్ ,పిపివో ఒరిజనల్,  అర్హతఉన్న ప్యామలీ పెన్షనర్ వారి ఆధార్ జిరాక్స్ , బ్యాంకు ఖాతా పాస్బుక్ మొదటి పేజీ లేదా స్టేట్మెంట్ లేదా కేన్సిల్డ్ చెక్క్ జతచేసి ప్యామలీ పెన్షన్ మంజూరు చేయమని వ్రాతపూర్వకంగా తెలియచేసి ప్యామలీ పెన్షన్ పొందవచ్చు. అట్టి ప్యామలీ పెన్షనర్కు చనిపోయిన సర్వీసు పెన్షనర్ అంత్యక్రియల చార్జీలు, రావలసిన అరియర్స్ ఏమైనా ఉంటే అవి చెల్లించబడతాయి. 

సర్వీస్ పెన్షనర్ మరణించిన సందర్భంలో ఫ్యామిలీ పెన్షన్ మంజూరు కొరకు జత చేయవలసిన సర్టిఫికెట్లు:-

1)  సర్వీస్ పెన్షనర్ మరణ ధ్రువీకరణ పత్రం.
 2) ఫ్యామిలీ పెన్షనర్ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ.
3) ఫ్యామిలీ పెన్షనర్ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ జిరాక్స్.
4) పాన్ కార్డు జిరాక్స్.    ( ఇది తప్పని సరి కాదు)
5) వ్యక్తిగత అభ్యర్ధన పత్రము.
6)  ఏ బి సి డి ఫారం.
7)ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ 
(ఫ్యామిలీ పెన్షనర్ జీవించి ఉన్న సందర్భంలో  ఇది కూడా తప్పనిసరి కాదు. ఒకవేల సర్వీస్ పెన్షనర్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ ఇద్దరూ మరణిస్తే ఇది తప్పనిసరి అవుతుంది.)
9) ఒరిజినల్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ 
(అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ నుండి గాని లోకల్ ఫండ్ నుండి గాని వచ్చినది. ఇది తిరిగి ఫ్యామిలీ పెన్షనర్ కు ఇస్తారు.)

సర్వీసు పెన్షనర్ యెక్క ప్యామలీ పెన్షనర్ ముందే మరణించిన  వారి తదనంతరం వచ్చే క్లైమ్స్ చెల్లింపులకు నామినీని నియమిస్తూ సర్వీసు పెన్షన్వారు జీవించి ఉండగానే నామినిని నియమించుకొనే సదుపాయం ఉంది . దీనికి గాను వారు సంబంధిత ట్రెజరీ అధికారికి నామినేషన్ A  ఫారం 2కాపీలు అందచేసినచో వారు OK చేసి ఒక కాపీ తిరిగి ఇస్తారు.

అట్టి కాపీ ఉన్నచో   వారి వారసులు  డెత్ సర్టిఫికెట్ వచ్చిన తరువాత ప్యునరల్ చార్జీలు చెల్లించమని కోరుతూ పై విధంగా ఓ లేఖ వ్రాస్తూ దానికి డెత్ సర్టిఫికెట్ ,పిపివో ఒరిజనల్ , వారి ఆధార్ జిరాక్స్ , బ్యాంకు ఖాతా పాస్బుక్ మొదటి పేజీ లేదా స్టేట్మెంట్ లేదా కేన్సిల్డ్ చెక్క్ జతచేసి సంబంధిత యస్ టి వో గారికి అందచేసి ప్యునరల్ చార్జీలు, అరియర్స్ ( ఏమైనా ఉంటే) పొందవచ్చు.

నామినేషన్ లేనిచో ఫేమలీ మెంబర్స్ సర్టిఫికెట్ సంబంధిత తహశిల్ధార్ కార్యాలయంలో తీసుకోవాలి. దాని ఆధారంగా అందులో ఉన్న  చనిపోయిన పెన్షనర్ కుటుంబ వారసులు అందరూ కలసి వారిలో ఒకరికి ప్యూనరల్ చార్జీలు , అరియర్స్ వగైరాలు చెల్లించుటకు ఆధరైజేషన్ ఇస్తూ నోటరీ అడ్వకేట్ చే జారీ చేయబడే నోటరీ అఫిడవిట్ , ఆధరైజ్ చేయబడ్డ  వారి ఆధార్ జిరాక్స్, బ్యాంకు ఖాతా పాస్బుక్ మొదటి పేజీ లేదా స్టేట్మెంట్ లేదా కేన్సిల్డ్ చెక్క్ జతచేసి సంబంధిత యస్ టి వో గారికి అందచేసి వాటిని పొందవచ్చు.

సర్వీసు పెన్షనర్ / ఫేమలీ పెన్షనర్ ఇరువురూ మరణించినచో వారివారసులు కుమారులైతే 25సంవత్సరాల వయస్సు వరకూ గాని ,సంపాదనా పరులైయ్యేంతవరకు ఏదిముందైతే అప్పటివకకూ, కుమార్తెలైతే 25సంవత్సరాల వయస్సు వరకూ లేదా వివాహం లేదా సంపాదన ఏది ముందైతే అప్పటి వరకు టైమ్ లిమిటేషన్ పెన్షన్ మంజూరు చేస్తారు. 

ఏ ఆధారంలేని పెండ్లి కాని కుమార్తెలు ,భర్తను కోల్పోయిన విడో లు , డైవర్స్డ్ డాటర్స్ ప్యామలీ పెన్షన్కు అర్హులు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.